Bigg Boss 7 Day 13 : ఈ వారం డేంజర్ లో ఉన్నది ఎవరు? ఇద్దరు కంటెస్టెంట్స్ సేఫ్..

నాగార్జున ఈ వారం అంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ అందరి మీద ఫైర్ అయ్యారు.

Bigg Boss 7 Day 13 : ఈ వారం డేంజర్ లో ఉన్నది ఎవరు? ఇద్దరు కంటెస్టెంట్స్ సేఫ్..

Bigg Boss 7 Day 13 full episode read here nagarjuna fires on contestants

Bigg Boss 7 Day 13 : రెండో వారంలో దూసుకుపోతున్న బిగ్‌బాస్ వీకెండ్ కి వచ్చేసింది. పవరాస్త్ర కోసం జరిగిన పోటీతో శుక్రవారం నాటి ఎపిసోడ్ ముగియగా శనివారం నాగార్జున వచ్చి ఈ పవరాస్త్ర శివాజీ గెలుచుకున్నాడు అని చెప్పారు. దీంతో శివాజీ ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యాడు. ఇక నాగార్జున ఈ వారం అంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ అందరి మీద ఫైర్ అయ్యారు.

ఒక మీటర్ పెట్టి.. రెడ్, ఎల్లో, గ్రీన్ రంగుల వైపు మీటర్ తిప్పుతూ వాళ్ళ గురించి చెప్పాడు. రెడ్ అంటే డేంజర్ జోన్ లో ఉన్నట్టు, ఎల్లో అంటే పర్లేదు, ఇంకా బాగా ఆడాలని, గ్రీన్ అంటే సేఫ్ జోన్ లో ఉన్నట్టు అని చెప్పాడు నాగ్. అయితే చాలా మందికి రెడ్ చూపించడం గమనార్హం.

మొదట శివాజీని గేమ్, టీంని బాగా లీడ్ చేస్తున్నావని మెచ్చుకున్నాడు. కానీ మాటి మాటికీ తలుపు తీస్తే బయటకి వెళ్ళిపోతా అనే దానిపై తిట్టి ఇంకోసారి అలా అనొద్దు అన్నాడు. అమర్ దీప్ ని కూడా బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు కానీ ప్రశాంత్ నామినేషన్ టైంలో అంత బీపీ తెచ్చుకొని అరిచినందుకు తిట్టాడు. సందీప్ ని కూడా బాగా ఆడుతున్నావని అన్నాడు. ఇక శుభశ్రీ, ప్రియాంక ఇంకా బాగా ఆడాలి, పర్వాలేదు అని చెప్పాడు.

రైతుబిడ్డ అని చెప్పుకునే ప్రశాంత్ ని మాత్రం ఆడేసుకున్నాడు నాగార్జున. ఈ వారం అంతా కంటెస్టెంట్స్ ప్రశాంత్ మీద ఫైర్ అయ్యారు. ఆడియన్స్ కూడా ఫైర్ అయ్యారు. ఇప్పుడు నాగార్జున కూడా. ఒక మొక్కని ఇస్తే దాన్ని పట్టించుకోలేకపోయావు నువ్వు రైతు బిడ్డా? అని ప్రశ్నించాడు. నామినేషన్స్ లో నిన్ను నామినేట్ చేస్తూ అందరూ చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను అని ప్రశాంత్ కి షాక్ ఇచ్చాడు.

ప్రిన్స్ యావర్ తో ఎందుకు ప్రతిదానికి అరుస్తావు, అరిస్తే కరెక్ట్ అయిపోదు అని చెప్పాడు. కానీ బాగా ఆడావు అని మెచ్చుకున్నాడు. గౌతమ్ ప్రిన్స్ ని స్టెరాయిడ్స్ బాడీ అన్నందుకు బాగా తిట్టి ఫైర్ అయ్యాడు. ప్రిన్స్ కి సారీ చెప్పించాడు. అలాగే గౌతమ్ సరిగ్గా ఆడట్లేదని క్లాస్ పీకాడు. అనంతరం దామిని, శోభాశెట్టిలను కూడా సరిగ్గా ఆడట్లేదని తిట్టాడు. తేజ ఎప్పుడు చూసినా నిద్రపోతున్నాడు అని క్లాస్ పీకాడు నాగ్. రతికకు కూడా గట్టిగానే క్లాస్ పీకాడు.

Bigg Boss 7 : ఒక‌ మొక్క‌ని చూసుకోలేని వాడు రైతు బిడ్డా.. నాగార్జున ఇచ్చి ప‌డేశాడు

ఈవారం నామినేషన్స్ నుంచి శివాజీ, అమర్ దీప్ సేఫ్ అయ్యారని చెప్పాడు నాగార్జున. ప్రశాంత్, షకీలా, గౌతమ్, ప్రిన్స్, తేజ, శోభాయాశెట్టి, రతిక మాత్రం ఇంకా డేంజర్ లోనే ఉన్నారని తెలిపాడు. మరి నేడు ఆదివారం ఎపిసోడ్ లో వీళ్లల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.