Manas
Bigg Boss 5 : మొత్తానికి బిగ్ బాస్ లో అనేక గొడవల తర్వాత కెప్టెన్సీ టాస్కులు పూర్తయ్యాయి. గత మూడు రోజులుగా కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ కు వివిధ రకాల టాస్కులు ఇచ్చి వాళ్ళ మధ్య గొడవలు పెట్టాడు బిగ్ బాస్. ప్రతి సారి కెప్టెన్సీ టాస్కులు అంటే గొడవలు మామూలు అయిపోయాయి. మొదట ‘నీ ఇల్లు బంగారం కాను’ అనే టాస్క్ ఇచ్చాడు. ఆ తర్వాత అందులో నుంచి సెలెక్ట్ అయిన వాళ్లకి ‘స్విమ్మింగ్ ఫూల్’ టాస్క్ ఇచ్చారు. ఈ సమయంలో హౌస్ లో ఫ్రెండ్స్ గా ఉండే మానస్, సన్నీ, కాజల్ మధ్య గొడవలు వచ్చాయి. వీళ్ళు ముగ్గురు విడిపోయారు.
Nayanatara : చిరంజీవి సినిమాలో నయన్‌కి భారీ పారితోషికం
ఆ తర్వాత ఫైనల్ టాస్కులో సిరి, ప్రియాంక, యానీ, మానస్ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. ‘రింగ్ ఈజ్ కింగ్’ టాస్క్‌లో ఎవరు రింగ్‌ను ఎక్కువ సేపు పట్టుకుంటారో వాళ్లే కెప్టెన్‌గా నిలుస్తారు. ఈ గేమ్‌లో మానస్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ మానస్ కాజల్‌కు సారీ చెప్పి ఆమెతో గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. మరి సన్నీకి కూడా సారీ చెప్తాడో లేదో చూడాలి. కొత్త కెప్టెన్ గా మానస్ పరఁఫార్మెన్స్ ఎలా ఉంటదో ఈ వారం చూడాలి.