×
Ad

Sarayu : బిగ్‌బాస్ మొత్తం ఫేక్.. అలాంటి షోలు చూడకండి.. మాజీ కంటెస్టెంట్ సరయు సంచలన వ్యాఖ్యలు..

త్వరలో బిగ్‌బాస్ మొదలవుతుండటంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సరయు బిగ్‌బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

  • Published On : July 23, 2023 / 03:25 PM IST

Bigg Boss Sarayu Sensational comments on Bigg Boss Show

Bigg Boss Sarayu :  తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 త్వరలో వస్తుంది. ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నారు, ఇప్పటికే ఓ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్‌బాస్ ప్రారంభమవుతుందని సమాచారం. బిగ్‌బాస్ సీజన్ 7 ప్రకటించడంతో ఈ షో అభిమానులు ఆసక్తిగా ఎప్పుడు మొదలవుతుందా, ఈ సారి షోలో ఎవరెవరు సెలబ్రిటీలు వస్తారో, ఎవరు ఇక్కడికి వచ్చి సెలబ్రిటీలు అవుతారో అని వెయిట్ చేస్తున్నారు.

ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా అనధికారికంగా వినిపిస్తున్నాయి. ఇక బిగ్‌బాస్ వస్తుంది అంటే దాని మీద విమర్శలు చేసే వాళ్ళు , సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. గతంలో బిగ్‌బాస్ లో పాల్గొని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఆ షో పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. గతంలో బిగ్‌బాస్ 5వ సీజన్ లో పాల్గొన్న సరయు ఈ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

యూట్యూబ్ లో ఓ ఛానల్ లో వల్గర్ వీడియోలు, బూతులు కంటెంట్ తో పేరు తెచ్చుకున్న సరయు గతంలో రెండుసార్లు బిగ్‌బాస్ లో పాల్గొంది. బిగ్‌బాస్ 5వ సీజన్ తో పాటు, ఓటీటీలో ప్రసారమైన నాన్ స్టాప్ షోలో కూడా పాల్గొంది. మొదటి సారి మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది. ఇక రెండో సారి నాలుగో వారంలో బయటకు వచ్చేసింది. అప్పట్లోనే తనను బాగా ఆడినా అనవసరంగా బయటకు పంపించేశారని వ్యాఖ్యలు చేసింది.

త్వరలో బిగ్‌బాస్ మొదలవుతుండటంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి సరయు బిగ్‌బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సరయు మాట్లాడుతూ.. ఈ రియాలిటీ షోలన్నీ ఫేక్. కొంతమంది డబ్బులిచ్చి వాళ్ళు ప్రమోట్ అవ్వడానికి ఈ షోలోకి వస్తారు. కొంతమందిని షో నిర్వాహకులే ప్రమోట్ చేస్తారు. ఈ షోలతో మనల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. దయచేసి ఇలాంటి షోలు చూడకండి. నేను బిగ్‌బాస్ కి వెళ్లి వచ్చాను కాబట్టే ఇప్పుడు ఇలా చెప్తున్నాను. మనం ఎంత ఆడినా లోపల వేరే వాళ్లకు సపోర్ట్ ఉంటుంది, మన ఆడినా వేస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Jabardasth Varsha : బిగ్‌బాస్ 7లోకి జబర్దస్త్ వర్ష ఎంట్రీ.. ఇండైరెక్ట్ గా చెప్పేసిందిగా..

త్వరలో బిగ్‌బాస్ సీజన్ 7 రాబోతున్న సమయంలో సరయు ఇలా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక సరయు ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో పాటు పలు సినిమాలతో కూడా బిజీగా ఉంది.