6 Journey : బిగ్ బాస్ టేస్టీ తేజ కీలక పాత్రలో నటించిన ‘6 జర్నీ’.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Tasty Teja 6 Journey Movie Release Date Announced

6 Journey : పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మాణంలో బసీర్ అలూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

డైరెక్టర్ బసీర్ మాట్లాడుతూ.. సమీర్, రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాని ముందుండి నడిపించారు. టేస్టి తేజ సినిమాకు మంచి ఎనర్జీ ఇచ్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం అని తెలిపారు. హీరో స‌మీర్ ద‌త్త మాట్లాడుతూ.. డిఫరెంట్ లవ్, యాక్షన్ థ్రిల్లర్‌గా 6 జర్నీ సినిమా తెర‌కెక్కింది అని తెలిపారు.

Also See : Suriya – Jyotika : ఆలయాలు సందర్శించిన స్టార్ కపుల్ సూర్య – జ్యోతిక.. ఫొటోలు వైరల్..

టేస్టీ తేజ మాట్లాడుతూ.. ఫుల్ లెంగ్త్ రోల్‌లో న‌టించిన 6 జ‌ర్నీ న‌టుడిగా నాకు మంచి గుర్తింపునిస్తుంది అని అన్నారు. నిర్మాత పాల్యం రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ల‌వ్‌, యాక్ష‌న్‌, మిస్ట‌రీ ..ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో 6 జ‌ర్నీ సినిమాని తెరకెక్కించాం. బ‌సీర్‌ గారు సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. ఏప్రిల్ 25న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం అని తేలిపోయారు.