Charan Re-Entry Bigg Boss 10 Telugu : చరణ్ రీ ఎంట్రీ.. నిరాశలో రోహిత్..? చరణ్ వర్సెస్ త్రిగున్.. బిగ్ బాస్ 10 ‘డే 11’ ఫుల్ ఎపిసోడ్..
మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన చరణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. (Bigg Boss 10 Telugu Charan Re Entry)
- Saketh U
- Updated on- September 18, 2026 / 10:26 AM IST
Image Credits : Jio Hotstar Bigg Boss Show Telugu 10 Day 11 Full Episode Charan Re-Entry
Charan Re-Entry Bigg Boss 10 Telugu: నిన్నటివరకు జరిగిన టాస్కుల్లో దేబ్జానీ, త్రిగున్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలినిలు ఇంకా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. ఇక నేటి ఎపిసోడ్ లో.. నిన్న ఆడకుండా గివ్ అప్ ఇచ్చి, త్రిగున్ టీమ్ ని రిక్వెస్ట్ చేసి ఇవాళ నేను ట్రై చేశాను అంటూ కారణాలు చెప్పుకొచ్చాడు. దేబ్జానీ మళ్ళీ ఏడ్చింది. ముకేశ్ వర్షిణి ని కాసేపు ఆదుకున్నాడు. నిన్నటి ఫుడ్ గొడవ ఇవాళ కూడా సాగడంతో వర్షిణి ఏడ్చింది.
కెప్టెన్సీ రేసులో ఉన్నవాళ్లలో దేబ్జానీ, త్రిగున్, రామ్ ప్రసాద్ లకు నెక్స్ట్ టాస్క్ ఇచ్చారు. ఒక టేబుల్ కింద నుంచి పాకుతూ పై నుంచి డిస్క్ మూవీ చేస్తూ వెళ్ళాలి. ఆ డిస్క్ లను తీసుకెళ్లి ఒక టేబుల్ మీద విసరాలి. అయితే ఈ గేమ్ లో దేబ్జానీ బాగా ఆడినా చివరకు రోహిత్, త్రిగున్ గెలిచారు. అనంతరం షాలిని – రోహిత్ మధ్య చిన్న గొడవ అయింది. షాలిని.. ఏమన్నా అంటే పడడు. అతను అంటే మాత్రం పడాలి. ఏదో ఒక రోజు తనతో గొడవ అవుతుంది అని చెప్పింది.
అనంతరం మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన చరణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే చరణ్ వచ్చినందుకు మొదట అగ్నిపరీక్ష టీమ్ అంతా హ్యాపీ అయి ఎగ్జైట్ అయి చరణ్ దగ్గరకు వచ్చి హత్తుకున్నారు ఒక్క రోహిత్ తప్ప. రోహిత్ చరణ్ వచ్చినందుకు కాస్త డిజప్పాయింట్ అయినట్టు ఉన్నాడు. మొదటి వారం రోహిత్ అతన్ని బలిపశువుని చేసి పంపించేసి సంగతి తెలిసిందే. చరణ్ రావడంతో మళ్ళీ అగ్నిపరీక్ష బ్యాచ్ అంతా గ్రూప్ గా కూర్చొని వాళ్ళ గ్రూపిజం చూపించారు. ఇక రోహిత్.. చరణ్ తనని ఎక్కడ నెగిటివ్ చేస్తాడేమో అని ముందే నన్ను నెగిటివ్ చూస్తున్నావా, మోసం చేశాను అనుకుంటున్నావా అని కవర్ చేసాడు. అనంతరం హౌస్ లో అందరూ కాసేపు కామెడీ చేసుకున్నారు. రామ్ ప్రసాద్, నరేష్ వేరేవాళ్లను ఇమిటేట్ చేస్తూ నవ్వించారు.
బిగ్ బాస్ చరణ్ కి మంచి ఆఫర్ ఇచ్చాడు. కెప్టెన్సీ రేసులో ఉన్న ఐదుగురిలో అర్హత లేని వారిని ఒకరిని రేసు నుంచి తొలిగించొచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న కంటెండర్లలో ఒకర్ని ఛాలెంజ్ చేసి వాళ్ళతో ఆడి వాళ్ళు ఓడిపోతే అతని కెప్టెన్సీ రేసులోకి రావొచ్చు అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో త్రిగున్, రామ్ ప్రసాద్, ముకేశ్, ఝాన్సీ, షాలినిలలో.. త్రిగున్ ని ఛాలెంజ్ చేసాడు. అతను కెప్టెన్ అవ్వడం మంచిది కాదు, అందుకే అతనితో ఆడి అతన్ని ఓడించాలి అని అనుకుంటున్నట్టు చెప్పాడు.
Also Read : Happy Journey Review : ‘హ్యాపీ జర్నీ’ రివ్యూ.. ఏడుగురు ఆడవాళ్లు ఫ్రాన్స్ ట్రిప్ కి వెళ్తే ఏం జరిగింది?
దీంతో బిగ్ బాస్ చరణ్ – త్రిగున్ లకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక నాలుగు కలర్స్ టైల్స్ ఇచ్చి ఒక మార్గం వేసుకొని దాని మీద నడిచి చివర్లో ఉన్న కంటెండర్ అనే బోర్డుని తీసుకోవాలి. అయితే ఆ కలర్స్ ఆర్డర్ కి కొన్ని రూల్స్ పెట్టాడు. ఈ గేమ్ కి రామ్ ప్రసాద్ ని సంచాలక్ గా పెట్టాడు బిగ్ బాస్. రామ్ ప్రసాద్ తో పటు అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ గేమ్ లో చరణ్ స్మార్ట్ గేమ్ ఆడాడు కానీ రూల్స్ ఫాలో అవ్వలేదు. దీంతో త్రిగున్ గెలిచాడు. త్రిగున్ కెప్టెన్సీ రేసులో తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక రేపు కెప్టెన్సీ కోసం మరో టాస్క్ జరగబోతున్నట్టు చివర్లో ఓ ప్రోమో వేశారు.
