Bigg Boss Telugu 10 today promo : వర్షిణి, షాలినిల మధ్య వాగ్వాదం.. మధ్యలో వచ్చిన త్రిగుణ్.. ఏంట్రా నీ బాధ అంటూ రెచ్చిపోయిన..
మంగళవారం (సెప్టెంబర్ 22) ఎపిసోడ్‌కు (Bigg Boss Telugu 10 today promo ) సంబంధించిన ప్రొమో వచ్చేసింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 22, 2026 / 11:06 AM IST
Bigg Boss Telugu 10 Day 16 today Promo 1 Varshini shalini fight
Bigg Boss Telugu 10 today promo : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మూడో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నామినేషన్స్ రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. సృష్టి-సుధీర్, వర్షిణి-షాలిని, రాంప్రసాద్-వంశీల మాటల యుద్ధం నడిచింది. ఇక మంగళవారం (సెప్టెంబర్ 22) ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. మంగవారం మిగిలిన వారు నామినేషన్స్‌లో పాల్గొన్నారు.
ముకేష్.. చరణ్‌ను నామినేట్ చేయడంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచినట్లుగా కనిపిస్తోంది. మీరు స్టార్ ప్లేయర్‌కు అర్హులు కారని, నేను ఆడియన్‌గా చూసి వచ్చానని చరణ్ అన్నాడు. అయితే.. నువ్వు కంటెస్టెంట్‌గా పనికి రావు, ఆడియన్‌గా వెళ్లి చూసుకో అంటూ ముకేష్ మండిపడ్డాడు. టెంపర్ వంశీ మధ్యలో వచ్చి ముకేష్‌తో వాగ్వాదానికి దిగినట్లుగా కనిపిస్తోంది.
ఆ తరువాత షాలిని, వర్షిణి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మధ్యలో త్రిగుణ్ రాగా.. ఏంట్రా నీ బాధ అంటూ వర్షిణి మండిపడింది. ఆరోజు కరెక్టుగా రాసిన వాళ్లకి ఇవ్వలేదనే నా బాధ అంటూ త్రిగుణ్ రెచ్చిపోయాడు. మొత్తంగా నామినేషన్స్ గరంగరంగా నడిచినట్లుగా కనిపిస్తోంది.
