Bigg Boss Telugu 10 : కుక్కలు అరిచినట్టు కంటెస్టెంట్స్ అరుపులు.. షాలిని ఓవర్ యాక్షన్.. చిచ్చు పెట్టిన అపూర్వ.. బిగ్ బాస్ 10 డే 22 ఎపిసోడ్..
షాలిని ఓవర్ యాక్షన్ చేసి హడావిడి చేసింది. (Bigg Boss Telugu 10)
- Saketh U
- Published on- September 28, 2026 / 10:58 PM IST
Bigg Boss Telugu 10
Bigg Boss Telugu 10 : మిథిలేష్ వెళ్ళిపోయినా విసదనం గురించి అగ్నిపరీక్ష టీమ్ చర్చించింది. అపూర్వ – ముకేశ్ తో వర్క్ విషయంలో గొడవ పడ్డాడు. నేను నువ్వు చెప్పిన వర్క్ చేయను, కెప్టెన్ మీటింగ్ పెట్టి అప్పుడు వర్క్స్ ఇవ్వు అన్నాడు. అపూర్వ కెప్టెన్ మీటింగ్ పెట్టింది. మీటింగ్ లో మళ్ళీ ముకేశ్ గొడవ పడ్డాడు. ముకేశ్, త్రిగున్ మాత్రం నాకు డిస్ రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్లిద్దరూ నన్ను కెప్టెన్ అని పిలవాల్సిందే అని చెప్పింది. కానీ త్రిగున్ పిలవను అన్నాడు. రోహిత్ – షాలిని మాట్లాడుతూ అపూర్వ విషయంలో గొడవ పడ్డారు. అపూర్వ వచ్చిన దగ్గర్నుంచి షాలినికి భయం పట్టుకున్న సంగతి తెలిసిందే.
దేబ్జానీ.. త్రిగున్, రామ్ ప్రసాద్ తో మాట్లాడుతూ అగ్నిపరీక్ష గ్రూపిజం గురించి మాట్లాడింది. మిథిలేష్ ని కూడా అందుకే సపోర్ట్ చేసి పంపారు అంటూ కారణాలు చెప్పింది. ఇక ఈ వారం టోటల్ డామినేషన్ అని బిగ్ బాస్ ప్రకటించాడు. కంటెస్టెంట్స్ ని రెండు జట్లుగా బిగ్ బాస్ స్వయంగా విడగొట్టాడు. వర్షిణి,ఝాన్సీ, రోహిత్, అపూర్వ, రామ్ ప్రసాద్, అమన్ , వంశీ, సుధీర్ లు ఒక టీమ్. వీళ్ళ టీమ్ కి భైరవ అనే పేరు పెట్టుకున్నారు. షాలిని, సృష్టి, చరణ్, నరేష్, త్రిగున్, ముకేశ్, దేబ్జానీ ఒక టీమ్. వీళ్లకు సప్త శక్తి అనే పేరు పెట్టుకున్నారు.
బిగ్ బాస్ మాట్లాడుతూ.. ఇచ్చే టాస్క్ లో గెలిస్తే ఇంకో జట్టుపై వచ్చే యుద్ధాల్లో కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఇస్తాను, నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. కొన్ని కత్తులు పంపించాడు. అందరూ ఒక్కొకటి తీసుకున్నారు. రెండు లేదా అంత కంటే ఎక్కువ సంపాదించాలి. దాని వల్ల ఆరో వారంలో బెనిఫిట్స్ ఇస్తాను అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఒకరి టీమ్ నుంచి ఇంకొక టీమ్ వాళ్ళ కత్తులు లాక్కునే ప్రయత్నాలు చేసారు. ఝాన్సీ, వర్షిణి, అపూర్వ తమ కత్తులను దాచుకున్నారు. ముకేశ్ వర్షిణి దగ్గర క్లోజ్ గా లాక్కోడానికి ట్రై చేయండి. కత్తుల కోసం అందరూ గొడవ పడ్డారు. నరేష్, రామ్ ప్రసాద్ ఇద్దరూ వేరు వేరు గ్రూప్స్ లో ఉండటంతో మొదటిసారి నరేష్ రామ్ ప్రసాద్ తో గొడవ పడ్డాడు.
Also Read : Mayookha Trailer : బిగ్ బాస్ అమన్ నటించిన కొత్త సినిమా.. మయూఖ ట్రైలర్ రిలీజ్..
బిగ్ బాస్ రణరంగంలో రథ నిర్మాణం అనే టాస్క్ ఇచ్చాడు. ఒక రథంకు సంబంధించి కొన్ని విడి భాగాలు ఉన్నాయి. ఆ రథాన్ని నిర్మించాలంటే దానికి కావలిసిన వస్తువులు దక్కించుకోవాలి. దానికి టాస్క్ ఆడాలి. కొన్ని బార్లు వదులుతూ ఉంటే వాటిని దక్కించుకొని దాచుకోవాలి ఇంకో టీమ్ కి దొరక్కుండా. కొన్ని రౌండ్స్ ఉంటుంది. ఫైనల్ గా ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు రథాన్ని అమరుస్తారు. ఎక్కువ రౌండ్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు రథం గెలిచినట్టు. ఆ టీమ్ గెలిచినట్టు. ఆ టీమ్ ఈ వారం టోటల్ డామినేషన్ చూపించొచ్చు. రెండు ప్రాంతాల్లో బిగ్ బాస్ ఆ బార్లని రిలీజ్ చేస్తాడు. నలుగురు మాత్రమే బార్లు కరెక్ట్ చేయాలి. రోహిత్, షాలినిలు సంచాలక్ గా ఉంటూనే ఆడాలి కూడా.
రోహిత్ – షాలిని మాట్లాడుతుంటే అపూర్వ మధ్యలోకి రావడంతో షాలిని మాట్లాడుకుంటాం అనగానే వెళ్ళిపోయింది అపూర్వ. అయినా షాలిని అరిచింది. ఓవర్ యాక్షన్ చేసి హడావిడి చేసింది. రోహిత్ ని ఎక్కడ తన నుంచి దూరం చేస్తుందో అని భయపడి అక్కర్లేకపోయినా గట్టి గట్టిగా అరిచింది షాలిని. అపూర్వతో షాలిని గొడవ పట్టుకుంది.
Also See : Dimple Hayathi : తిరుమలలో డింపుల్ హయతి కూచిపూడి నృత్యం.. ఫొటోలు వైరల్..
ఇక గేమ్ మొదలయ్యాక రెండు చోట్ల నుంచి బార్లు వచ్చాయి. కలెక్ట్ చేసుకోడానికి రెండు టీమ్స్ అందరూ ఎగబడి, గొడవ పడి, ఒకర్నొకరు లాక్కొని గేమ్ ఆడారు. మధ్యలో బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ లో షాలిని సృష్టి కత్తి తీసుకోండని అపూర్వ తన టీమ్ ని పిలిచింది. దీంతో షాలిని ఒక్కతే ఉన్నప్పుడు వేరే టీమ్ అందరూ ఆమె మీద పడ్డారు. షాలిని ఆ కత్తి సృష్టిని ఇచ్చి వెళ్లిందని చెప్పకుండా గొడవ పడింది. అపూర్వ కావాలనే చేసింది ఇలా అని అనడంతో రెండు టీమ్స్ మధ్య పెద్ద గొడవ అయింది. షాలిని కూడా రోహిత్ పై ఫైర్ అయింది. అపూర్వ పై ఫైర్ అయింది. త్రిగున్ మధ్యలోకి వచ్చి షాలిని సపోర్ట్ చేయడంతో రోహిత్ ఫైర్ అయ్యాడు. ఈ ఇద్దరూ కొట్టుకునేదాకా వెళ్లారు. అపూర్వ తన టీమ్ కోసం ఆడితే షాలిని సృష్టిని కత్తి ఇచ్చిందని చెప్పకుండా కత్తి దాచుకుంటుంటే అసలు ఇదంతా అపూర్వ వల్లే అని తిట్టారు. చివరగా తనే అరిచి తనే ఓవర్ యాక్షన్ చేసి చివరకు షాలినినే ఏడ్చింది. మొత్తంగా టాస్క్ లో మొదటి రౌండ్ లో భైరవ టీమ్ 32 బార్లు, సప్త శక్తి టీమ్ 19 బార్లు గెలుచుకున్నారు. ఇక రేపు నామినేషన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది.
