Bigg Boss Telugu 10 : షాలిని, రోహిత్ హగ్గులు.. వర్షిణి, ముకేశ్ రొమాన్స్.. రోహిత్, త్రిగున్ గొడవ.. బిగ్‌ బాస్ 10 డే 32 ఎపిసోడ్‌..

అపూర్వ- చరణ్, అమన్- త్రిగున్, ముకేశ్- ఝాన్సీ, నరేష్- రామ్ ప్రసాద్, రోహిత్- షాలినిలు జంటలుగా ఆడుతున్న సంగతి తెలిసిందే. (Bigg Boss Telugu 10)

  • Published on- October 8, 2026 / 10:45 PM IST

Bigg Boss Telugu 10

Bigg Boss Telugu 10 : ఝాన్సీ, ముకేశ్ గత వీకెండ్ లో గిఫ్టులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. వాటిని బిగ్ బాస్ పంపించాడు. చరణ్ కాసేపు దేబ్జానీతో ఫ్లర్ట్ చేశారు. త్రిగున్ అపూర్వ ఆడుతున్న డబల్ గేమ్ రోహిత్ దగ్గర చెప్పాడు. రీ లోడ్ లో లీడర్ బోర్డు లో పైకి వెళ్లి నామినేషన్స్ నుంచి సేఫ్ అవ్వడానికి టాస్కులు కంటిన్యూ చేశారు. అపూర్వ- చరణ్, అమన్- త్రిగున్, ముకేశ్- ఝాన్సీ, నరేష్- రామ్ ప్రసాద్, రోహిత్- షాలినిలు జంటలుగా ఆడుతున్న సంగతి తెలిసిందే.

నేడు బాల్స్ తో ఓ పెద్ద టాస్క్ ఇచ్చారు. ఇద్దరిద్దరిలో ఎవరో ఒకరు ఆడాలి. అయిదు బాల్స్ ని తీసుకెళ్లి హొల్స్ లో పెట్టాలి, ఎవరు ముందు పూర్తయితే వాళ్ళు అవ్వని వాళ్ళది తీసేయొచ్చు. వంశీ, దేబ్జానీలు ఈ టాస్క్ కి సంచాలక్ గా వ్యవహరించారు. ఇందులో షాలిని, అపూర్వ, రామ్ ప్రసాద్, ముకేశ్ ,అమన్ ఆడారు. టాస్క్ లో
అమన్, రామ్ ప్రసాద్, ముకేశ్, షాలిని, అపూర్వ వరుస క్రమంలో ఆటని పూర్తి చేశారు.

Also Read : Vijay Deverakonda : వాళ్లకు బలుపు అనిపిస్తే నేను తగ్గాలా..? నేను మారను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..

ఆట అయిన తర్వాత మళ్ళీ అపూర్వతో రోహిత్ మాట్లాడుతుంటే షాలిని వచ్చి గొడవ పడింది రోహిత్ తో. అగ్నిపరీక్ష బ్యాచ్ లో గొడవలు వస్తున్నాయని రోహిత్ అందర్నీ కూల్ చేయడానికి గొడవలు తగ్గించడానికి ట్రై చేసాడు. కాసేపు బిగ్ బాస్ సాంగ్స్ వేయడంతో స్విమ్మింగ్ పూల్ లో డ్యాన్సులు చేశారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో వర్షిణి – ముకేశ్ స్విమ్మింగ్ పూల్ లో రొమాన్స్ చేశారు. మరో పక్క షాలిని – రోహిత్ కుదిరినప్పుడల్లా హగ్గులు ఇచ్చుకుంటున్నారు.

ఇందాకటి ఆటలో అమన్ టాప్ లో ఉండటంతో అమన్ – త్రిగున్ గ్రూప్ కి ఎక్కువ పాయింట్స్ రావడంతో ఈ ఇద్దరు నామినేషన్స్ నుంచి తప్పుకున్నారు. నెక్స్ట్ టాస్క్ కి మిగిలిన వాళ్ళు రెడీ అయ్యారు. చిత్రం భళారే విచిత్రం అనే టాస్క్ ఇచ్చారు. సంచాలక్ చెప్పిన బొమ్మని ఇద్దరిలో ఒకరు గీస్తే ఇంకొకరు ఆ బొమ్మ వస్తువును ఊహించి తీసుకురావాలి స్టోర్ రూమ్ నుంచి. వర్షిణి, త్రిగున్, అమన్ సంచాలక్ లు ఈ టాస్క్ కి. ఇందులో అపూర్వ, షాలిని, ఝాన్సీ, నరేష్ బొమ్మలు గీయగా రామ్ ప్రసాద్, రోహిత్, ముకేశ్, చరణ్ బొమ్మలు తెచ్చారు. ఈ టాస్క్ లో నరేష్ – రామ్ ప్రసాద్ టాప్ లో ఉన్నారు. తర్వాత అపూర్వ చరణ్, షాలిని – రోహిత్ ఉన్నారు. చివర్లో ముకేశ్ -ఝాన్సీ ఉన్నారు. పాయింట్స్ పట్టికలో కూడా టాప్ లో రామ్ ప్రసాద్ – నరేష్ ఉన్నారు. మరి వీరిలో నామినేషన్స్ నుంచి ఎవరు తప్పుకుంటారో చూడాలి.

Also See : Ranabaali Trailer Launch : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు..