Bigg Boss Today Promo : సీక్రెట్ రూమ్‌లో చైత్ర‌, చ‌ర‌ణ్‌?.. హౌస్‌మేట్స్‌కు షాకిచ్చిన నాగార్జున‌.. మీరు అలా అనుకుంటే.. ప్రొమో అదుర్స్‌..

Bigg Boss Telugu 10 Day 6 Today Promo 1: బిగ్‌బాస్ సీజ‌న్ 10లో తొలి వీకెంట్‌కు (Bigg Boss Today Promo) సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది.

Bigg Boss Telugu 10 Day 6 Today Promo 1 Chaitra Rai and Charan are not in Secret Room

Bigg Boss Telugu 10 Day 6 Today Promo 1 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో తొలి వారంలోనే ఇద్ద‌రు చరణ్, చైత్ర రాయ్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎంత‌గానో ఎదురుచూస్తున్న తొలి వీకెంట్ వ‌చ్చేసింది. శ‌నివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వ‌చ్చేసింది. హోస్ట్ నాగార్జున త‌న‌దైన శైలిలో కంటెస్టెంట్ల‌కు వార్నింగ్ ఇచ్చాడు.

మీ ఉద్దేశ్యంలో ఫ‌స్ట్ వార‌మే ఇద్ద‌రిని పంపించి వేస్తారా? వాళ్లు ఇద్ద‌రు సీక్రెట్ రూమ్‌లోనే ఉన్నారేమో ఇలాంటి ఆలోచ‌న‌లు అన్నీ మీ ద‌గ్గ‌ర ఉండి ఉంటాయ్ అని హౌస్‌మేట్స్‌తో నాగార్జున అన్నాడు. ఇందుకు అవున‌ని కంటెస్టెంట్లు అన్నారు. వెంట‌నే నాగార్జున‌.. చ‌ర‌ణ్‌, చైత్ర‌ల‌కు వీడియో కాల్స్ చేయ‌గా.. వారిద్ద‌రు కూడా తాము సీక్రెట్ రూమ్‌లో లేమ‌ని, ఎవ‌రి ఇళ్ల‌లో వాళ్ల‌మే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. వెంట‌నే నాగార్జున మాట్లాడుతూ.. ఆట‌లో ఏ మాత్రం అల‌స‌త్వం వ‌చ్చినా మీరు బిగ్‌బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతార‌ని కంటెస్టెంట్ల‌కు వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా ప్రొమో అదిరిపోయింది.

Also Read – Irumudi Actress Sam : హాఫ్ శారీలో ఇరుముడి నటి.. సామ్ క్యూట్ ఎక్స్‌ప్రెష‌న్స్‌..

నాగార్జున తొలివారంలో ఎవ‌రెవ‌రికి వార్నింగ్ ఇచ్చాడు? ఎవ‌రి ఆట‌తీరు బాగాలేద‌ని చెప్పాడు ? చైత్ర‌, చ‌ర‌ణ్‌లు నిజంగానే ఎలిమినేట్ అయ్యారా? లేదంటే వాళ్ల‌ను సీక్రెట్ రూమ్‌లో ఉంచారా? వంటివి తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వ‌ర‌కు వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. నెటిజ‌న్ల అభిప్రాయం ప్ర‌కారం.. చైత్ర‌, చ‌ర‌ణ్‌ల‌ను సీక్రెట్ రూమ్‌లోనే ఉంచార‌ని అంటున్నారు. ఒక‌వేళ ఇంటికి పంపించినా వైల్డ్ కార్డు ద్వారా ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రిని ఒక‌టి లేదా రెండు వారాల త‌రువాత హౌస్‌లోకి పంపించే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెబుతున్నారు.