Bigg Boss Captaincy Task : త్రిగున్ ఫ్యామిలీ.. నటరాజ్ మాస్టర్ ఓవరాక్షన్.. ఇదేం కెప్టెన్సీ టాస్క్ రా బాబు..
ఇప్పటికే పలువురి ఫ్యామిలీలు రాగా నేడు మొదట త్రిగున్ భార్య, కూతురు హౌస్ లోకి వచ్చారు. (Bigg Boss Captaincy Task)
- Saketh U
- Published on- November 13, 2026 / 10:49 PM IST
Bigg Boss Telugu 10
Bigg Boss Captaincy Task : బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే పలువురి ఫ్యామిలీలు రాగా నేడు మొదట త్రిగున్ భార్య, కూతురు హౌస్ లోకి వచ్చారు. త్రిగున్ భార్య ఎమోషనల్ అయింది. త్రిగున్ కూతురుతో ఆడుకున్నాడు. అందరూ పరిచయం చేసుకున్నారు. త్రిగున్ భార్య ఎమోషనల్ అయి హత్తుకొని ఏడ్చేసింది. నువ్వు ఎలాగైనా ట్రోఫీ ఇంటికి తీసుకురావాలి అని చెప్పింది త్రిగున్ వైఫ్. వర్షిణి వల్ల చాలా హర్ట్ అయ్యాను అని చెప్పాడు భార్యకు త్రిగుణ. త్రిగున్ కూతురు చిన్న పాప కావడంతో అందరూ ఆమెతో ఆడుకున్నారు. అనంతరం ఎమోషనల్ గానే వెళ్లిపోయారు త్రిగున్ భార్య – కూతురు.
అనంతరం ముకేశ్ – నీతూ జోక్ గా మాట్లాడుకుంటూనే సీరియస్ అయి గొడవ పెట్టుకున్నారు. ముకేశ్ – వర్షిణి తో జాగ్రత్తగా మాట్లాడాలి అని నీతూ, శివ డిస్కషన్ పెట్టుకున్నారు.
నెక్స్ట్ నీతూ మాస్టర్ భర్త నటరాజ్ మాస్టర్, ఆమె కూతురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నీతూ, నటరాజ్ హగ్ చేసుకొని ఏడ్చారు. నువ్వు లోపల ఆడు, నేను బయట ఆడతాను నువ్వు కంగారు పడకు అని చెప్పాడు భార్యకు నటరాజ్ మాస్టర్. నువ్వు అసలు ఏడవకు ఏం జరిగినా హౌస్ లో అని చెప్పాడు. నీతూ మాస్టర్ ప్రతిదానికి ఏడుస్తుందని తెలిసిందే. వంశీ దగ్గరకు వచ్చి కోపంగా చూస్తూ గొడవ పడదాం అనుకున్నాను అనే అర్ధం వచ్చేలా మాట్లాడి.. కానీ మీ పాపని చూసి మొత్తం మారిపోయాను అన్నాడు.
Also Read : Srinath Chandrashekar : టాలీవుడ్లో మరో తెలంగాణ దర్శకుడు.. చంద్రుడి మీదకు రాకెట్ అంటూ..
త్రిగున్ తో నేను రెండు సార్లు వచ్చిన దానికంటే నువ్వు పదిసార్లకు సరిపడా కంటెంట్ ఇస్తున్నావు అన్నాడు. నీతూ, నటరాజ్, వాళ్ళ పాప ముగ్గురు కూర్చొని మాట్లాడుకున్నారు. నటరాజ్ మాస్టర్ సలహాలు ఇచ్చారు. త్రిగున్ ట్రిగర్ చేస్తున్నాడు అవ్వకు అన్నాడు. అందరి గురించి సలహాలు ఇచ్చాడు. వంశీ కి జాగ్రత్త, చూసి ఆడు అని చెప్పారు. నీతూతో పడ్డ గొడవల గురించి మాట్లాడాడు. వంశీ మీద కోపం ఉన్నట్టు తెలుస్తుంది. నటరాజ్ మాస్టర్ కూడా ఇది గేమ్ అని మర్చిపోయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ మాట్లాడారు త్రిగున్, వంశీతో. గత నామినేషన్స్ లో నీతూ మాస్టర్ చేసిన సింపతీ గేమ్ కి వంశీ, త్రిగున్ ఫైర్ అయినా సంగతి తెలిసిందే. నటరాజ్ మాస్టర్ వచ్చినప్పుడు, వెళ్ళేటప్పుడు డ్యాన్సులు వేసి సందడి చేసాడు.
వర్షిణి – త్రిగున్ ముకేశ్ గురించి మాట్లాడుకున్నారు. దేబ్జానీ – ముకేశ్ మాట్లాడుకున్నారు. శివ.. వంశీ వల్లే త్రిగున్ ఉన్నాడు అని రామ్ ప్రసాద్ తో మాట్లాడాడు. శివ అందరి దగ్గరకు వెళ్లి త్రిగున్ గురించి నెగిటివ్ గా చెప్పడం మొదలు పెట్టారు.
స్కూల్ టాస్క్ లో అందరూ బాగా ఆడినందుకు కెప్టెన్సీ కంటెండర్స్ గా అందరికి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. కెప్టెన్ టాస్కులు మొదలుపెట్టాడు. నెంబర్స్ వేసి ఉన్న షీట్స్ కొని పెట్టారు. బిగ్ బాస్ నెంబర్ చెప్పగానే కంటెస్టెంట్స్ దాని మీద నిలబడాలి. ఎవరు నిలబడకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చిన్న చిన్న షీట్స్ ఉన్నాయి. చివరి వరకు ఉన్న నలుగురు నెక్స్ట్ లెవల్ కి వెళ్తారు అని ప్రకటించాడు బిగ్ బాస్.
Also Read : Dada Song : బాలకృష్ణ ‘దాదా’ సినిమా ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. బాలయ్య పాడిన పాట ఎలా ఉంది..?
మొదట ఒక నెంబర్ చెప్పగా ఆ షీట్ మీద అందరూ ఇరుక్కొని ఉన్నారు. ఎవరు లేరో బిగ్ బాస్ వల్లనే డిసైడ్ చేసుకోమన్నాడు. దాంతో అందరూ గొడవ పడ్డారు. సుధీర్ అవుట్ అయ్యాడు మొదట. అనంతరం సుధీర్ సంచాలక్ గా మారాడు. నెక్స్ట్ వర్షిణి అవుట్ అయింది. తర్వాత రామ్ ప్రసాద్ అవుట్. ఆటలో ముకేశ్ కి హెల్ప్ చేసినందుకు వర్షిణితో గొడవ పడ్డాడు సుధీర్. అనంతరం వర్షిణి సంచాలక్. నీతూ మాస్టర్ అవుట్ అయింది. త్రిగుణ, ముకేశ్ గొడవ పడ్డారు. దేబ్జానీ అవుట్ అయింది. రామ్ ప్రసాద్ సంచాలక్ గా మారాడు. శ్వేతా, ముకేశ్ ఒకేసారి అవుట్ అయ్యారు. వర్షిణి అవుట్ అయ్యాడని ముకేశ్ పేరు చెప్పడం గమనార్హం.
నెక్స్ట్ షీట్ మీద ప్లేస్ కోసం కొట్టుకుంటూ త్రిగున్, శివ వాళ్ళే తోసుకుంటూ బయటకు వెళ్లిపోయారు. దాంతో వాళ్ళే అవుట్ అయ్యారు. దాంతో శివ త్రిగున్, అమన్ తో గొడవ పడ్డాడు. ఆ షీట్స్ మీద నిల్చోడానికి ఒకర్నొకరు తోసుకొని, కొట్టుకొని ఓ యుద్ధమే చేసారు. దీంతో ఇదెక్కడి కెప్టెన్సీ టాస్క్ రా బాబు అనుకుంటున్నారు ప్రేక్షకులు. చివరగా వంశీ, నరేష్, అమన్, రామకృష్ణ నెక్స్ట్ లెవల్ కి వెళ్లారు. గేమ్ లో వర్షిణి ముకేశ్ పేరు చెప్పడంతో ఆట అంతా అయ్యాక ముకేశ్.. వర్షిణి బాగానే గొడవ పడ్డారు. రేపు కెప్టెన్ గేమ్ కొనసాగనుంది. రేపు హౌస్ కి ఆ నలుగురిలో ఎవరో ఒకర్ని కొత్త కెప్టెన్ అవుతారు.
