Bigg Boss Family Week : బిగ్ బాస్ లోనే మొదటిసారి.. హౌస్‌లో నిశ్చితార్థం.. శివ – ప్రియాంక ఎమోషనల్.. ముకేశ్ తల్లితో వర్షిణి..

ఫ్యామిలీ వీక్ కావడంతో నిన్నటి నుంచి ఫ్యామిలీలు రావడం మొదలుపెట్టారు. (Bigg Boss Family Week)

  • Published on- November 11, 2026 / 10:43 PM IST

Bigg Boss Family Week

Bigg Boss Family Week : ఫ్యామిలీ వీక్ కావడంతో నిన్నటి నుంచి ఫ్యామిలీలు రావడం మొదలుపెట్టారు. నిన్న నరేష్, వంశీ, శ్వేతా ఫ్యామిలీలు వచ్చాయి. నిన్నటి BB స్కూల్ టాస్క్ మొదలుపెట్టారు. నరేష్, రామ్ ప్రసాద్ లిప్ స్టిక్ ని ఒకరి మొహంపై ఒకరు రాసుకొని కామెడీ చేసారు.

ఇవాళ మొదట ముకేశ్ తల్లి వచ్చింది. ఆమె ముకేశ్ ని హత్తుకొని ఏడ్చేసింది. ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. కంటెస్టెంట్స్ అందర్నీ పరిచయం చేసాడు ముకేశ్. నరేష్ ని నా ఫేవరేట్, నా మనవడికి ఫేవరేట్ అని చెప్పింది. ముకేశ్, తన తల్లి కూర్చొని మాట్లాడుకున్నారు. ముకేశ్ కి ఎక్కువ కోపం వస్తుంది, కోపం తగ్గించుకో అని చెప్పింది. వర్షిణి కూడా ముకేశ్ తల్లితో క్లోజ్ గా ఉండి ఎమోషనల్ అయింది. ముకేశ్, వర్షిణి ఇద్దరూ ముకేశ్ తల్లి ఒళ్ళో పడుకొని ఏడ్చారు. సుధీర్ తో మాట్లాడి మీరిద్దరూ అన్నదమ్ములు, గొడవ పడకండి అని చెప్పింది ముకేశ్ తల్లి. ముకేశ్ అక్క, బావ, అల్లుడు మాట్లాడిన వీడియో చూపించారు. వెళ్లేముందు అందరూ కలిసి డ్యాన్స్ వేశారు. చివర్లో త్రిగున్ కూడా ఏడ్చాడు. తన ఫ్యామిలీ గుర్తొస్తుంది, తనకు అమ్మ లేదు అని ఏడ్చాడు.

Also See : Anirudh Kavya Maran : ఘనంగా అనిరుధ్ – కావ్య మారన్ వివాహం.. ఫొటోలు వైరల్..

నెక్స్ట్ BB స్కూల్ కామెడీ కాసేపు నడిచింది. దేబ్జానీ తెలుగు టీచర్ గా వచ్చింది. మధ్యలో నరేష్ కాసేపు వచ్చి కామెడీ చేసాడు. తెలుగు టంగ్ ట్విస్టర్స్ చెప్పించారు.

నెక్స్ట్ అమన్ ఫాదర్ వచ్చారు. అమన్ తన తండ్రిని హగ్ చేసుకొని ఏడ్చేశాడు. అందర్నీ పరిచయం చేసాడు అమన్. అమన్, తండ్రి కూర్చొని మాట్లాడుకున్నారు. వెళ్లేముందు మరోసారి ఇద్దరూ ఎమోషనల్ అయి ఏడ్చారు.

నెక్స్ట్ శివకు కాబోయే భార్య, నటి ప్రియాంక జైన్ వచ్చింది. ఇద్దరూ హగ్ చేసుకొని ఏడ్చారు. శివ కోసం కొత్త డ్రెస్ తీసుకొచ్చింది. బిగ్ బాస్ హిస్టరీలో మొదటిసారి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఇంతకంటే మంచి టైం ఉండదు నాకు. అందుకే నేను, శివ బిగ్ బాస్ లో ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని ఫిక్స్ అయినట్టు తెలిపింది ప్రియాంక. ఇంట్లో వాళ్లంతా కూడా డ్రెస్ లు చేంజ్ చేసుకొని గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ సెలబ్రేట్ చేసారు. ప్రియాంక గురించి ఎమోషనల్ డైలాగ్స్ చెప్పాడు శివ. అనంతరం ఒకరికొకరు మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగి ఎస్ చెప్పారు. ఒకరికొకరు రింగ్స్ మార్చుకున్నారు, అనంతరం దండలు మార్చుకున్నారు. హౌస్ మెంబర్స్ అంతా వాళ్ళను ఎత్తుకొని సందడి చేసారు. అందరూ కలిసి ఓ పెళ్లి సాంగ్ కి డ్యాన్స్ చేసారు. అనంతరం ప్రియాంక అందరికి జాగ్రత్తగా మాట్లాడండి, ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు అంటూ సలహా ఇచ్చింది. తర్వాత శివ తల్లి మాట్లాడిన వీడియో చూపించారు. అనంతరం ప్రియాంక వెళ్ళిపోయింది. మిగిలిన ఫ్యామిలీలు రేపు రానున్నారు.

Also See : Priya Bhavani Shankar : పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్.. ఫొటోలు వైరల్..

ఇలా బిగ్ బాస్ హౌస్ లో నిశ్చితార్థం చేయడం ఇదే మొదటిసారి. గత కొన్నాళ్లుగా లివ్ ఇన్ లో ఉంటున్నారు శివ – ప్రియాంక. వచ్చే సంవత్సరం వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పుడు ఇలా బిగ్ బాస్ లో నిశ్చితార్థం చేసుకోవడం గమనార్హం.