Bigg Boss Wild Card Entry : ఇద్దరు ఎలిమినేట్.. అయిదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. షాలిని టార్గెట్.. ఇకనైనా మారుతుందా? బిగ్‌ బాస్ 10 డే 35 వీకెండ్ ఎపిసోడ్‌..

మొత్తానికి ఈ వారం ఇద్దర్ని ఎలిమినేట్ చేసి అయిదుగురిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా తీసుకొచ్చారు. (Bigg Boss Wild Card Entry)

  • Published on- October 11, 2026 / 10:47 PM IST

Bigg Boss Wild Card Entry

Bigg Boss Wild Card Entry : నేడు ఆదివారం వీకెండ్ ఎపిసోడ్. మొదట నాగార్జున డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ తో మాట్లాడారు. నామినేషన్స్ లో ఉన్న నరేష్ , రోహిత్,ముకేశ్, అపూర్వ, చరణ్, షాలినిలని పిలిచారు. ఆడియన్స్ ఓట్ల ద్వారా లీస్ట్ లో ఉన్న వాళ్ళను పంపిస్తాను అని ఓ టాస్క్ తో చెప్పారు. దీంట్లో అపూర్వ ఎలిమినేట్ అయింది. అపూర్వ ఎలిమినేట్ అయితే షాలిని సేవ్ అయినందుకు షాలిని, రోహిత్ హగ్ చేసుకున్నారు. ఇన్నాళ్లు అందరి మీద పడి అరిచిన అపూర్వ ఇప్పుడు ఏడుస్తూ బయటకు వచ్చింది.

అపూర్వ స్టేజిపైకి వచ్చాక అయిదుగురు గురించి ఒక చేదు నిజం చెప్పాలి అన్నారు. ఎవరి గురించ్స్హి చెప్తే వాళ్ళు చేదు జ్యూస్ తాగాలి అని చెప్పారు. అపూర్వ.. రోహిత్ – పక్కన మనుషులను చిన్న చూపు చుస్తావు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని తన కారణాలు చెప్పింది. రామ్ ప్రసాద్ – ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోడు, కన్నింగ్ అని చెప్పింది. షాలిని – నువ్వు నిన్ను లాస్ అయ్యావు, రోహిత్ చేతులో ఉంది నీ గేమ్, మాటలు వదులుతావు అని చెప్పింది. సుధీర్ – అయోమయం అని చెప్పింది. అమన్ – నువ్వు ఏది అనిపిస్తే అది చెయ్, నీ తప్పులు ఒప్పుకో అని చెప్పింది. చివరగా షాలిని – రోహిత్ మీ మధ్యలోకి రావాలని అనుకోలేదు, నువ్వు, రోహిత్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి వెళ్ళిపోయింది.

అనంతరం మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు శివ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు డ్యాన్స్ తో. శివ తన కాబోయే భార్య, మాజీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి మాట్లాడాడు. నాగార్జున బిగ్ బాస్ గురించి మాట్లాడారు. లోపలి వెళ్లకముందే లోపలి ఎవరు వస్తున్నారో కంటెస్టెంట్స్ కి చూపించారు. శివని ఏ ఇద్దర్ని టార్గెట్ చేస్తావు అని అడిగారు. షాలిని అని చెప్పి బిగ్ బాస్ కప్ కోసం కాకుండా రోహిత్ కోసం వచ్చావు అన్నాడు. షాలిని రివర్స్ కౌంటర్ వేస్తే నాగార్జున షాలినికి కౌంటర్ ఇచ్చాడు. నెక్స్ట్ చరణ్ పేరు చెప్పి బయటకు వెళ్లి రీ ఎంట్రీ ఇచ్చినా ఆడట్లేదు అని తన కారణాలు చెప్పారు. శివకు 2 లక్షలు క్యాష్ ఉన్న సూట్ కేస్ ఇచ్చి లోపలికి పంపించారు. మ్యాజిక్ పవర్స్ ఉన్నవాళ్ళలో ఒకర్ని సెలెక్ట్ చేసుకొని ఛాలెంజ్ చేసి వాళ్ళతో టాస్క్ ఆడాలి అని చెప్పారు శివకు. టాస్క్ గెలిస్తే పవర్ నీది, ఓడిపోతే 2 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయి అని చెప్పారు. అలాగే నేడు నామినేషన్స్ లో ఉన్న వారిలో నీకు హౌస్ లో ఉండటానికి అర్హత ఎవరికీ ఉంది అనిపిస్తే ఇద్దరికీ సేఫ్టీ బ్యాడ్జెస్ ఇవ్వాలి అని చెప్పారు.

Also Read : Rama Krishna : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. అగ్నిపరీక్ష రామకృష్ణ గురించి తెలుసా?

శివ కుమార్ లోపలికి వెళ్ళాక తన బ్యాడ్జ్ లలో ఒకటి నరేష్ కి ఇచ్చాడు. ఇంకో బ్యాడ్జ్ ముకేశ్ కి ఇచ్చారు. నెక్స్ట్ మ్యాజిక్ పవర్ టాస్క్ ఇచ్చారు. శివ కుమార్ కాసేపు ఆలోచించుకుంటా అని ఆడియన్స్, బిగ్ బాస్ తో మాట్లాడారు. రోహిత్ సంచాలక్. త్రిగున్ తో పోటీ పాడటానికి శివ రెడీ అయ్యాడు. ఒక పిరమిడ్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో త్రిగున్ గెలిచాడు. దీంతో అతని మ్యాజిక్ పవర్ అతని దగ్గరే ఉంటుంది. అలాగే 2 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ కి యాడ్ అయింది. ఓడిపోయినోళ్లకు పనిషమెంట్ ఇవ్వాలి అని నాగార్జున చెప్పడంతో హౌస్ డ్యూటీలలో ఏదో ఒకటి ఇమ్మన్నారు. దీంతో వాష్ రూమ్ క్లీనింగ్ ఇచ్చారు శివకు.

నెక్స్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ నటి దక్షి గుత్తికొండ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. తన గురించి చెప్పింది. రోహిత్ ఇష్టం, షాలిని ఇష్టం లేదు అని చెప్పింది. తనకు కూడా టార్గెట్ ఎవరు అని అడగడంతో షాలినిని, నరేష్ ని టార్గెట్ చేసింది. దక్షికి కూడా క్యాష్ ఉన్న సూట్ కేస్, రెండు సేఫ్టీ బ్యాడ్జ్ లు ఇచ్చారు. శివ కుమార్ కి ఇచ్చినట్టే మ్యాజిక్ పవర్ టాస్క్ దక్షికి కూడా ఇచ్చారు. దక్షి తన సేఫ్ బ్యాడ్జెస్ ని రోహిత్, ముకేశ్ లకు ఇచ్చింది. దక్షి మ్యాజిక్ పవర్ టాస్క్ లో నరేష్ ని ఛాలెంజ్ చేసింది. సుధీర్ సంచాలక్. ఒక బాల్ టాస్క్ ఇచ్చారు. నరేష్ గెలిచాడు ఈ టాస్క్ లో. దీంతో తన మ్యాజిక్ పవర్ తన దగ్గరే ఉంది. దక్షి తెచ్చిన 2 లక్షలు ప్రైజ్ మనీ కి యాడ్ చేసారు. ఆమె ఓడిపోయినందుకు గిన్నెలు టోమ్ పనిషమెంట్ ఇచ్చారు.

మూడో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా నీతూ నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చింది. డ్యాన్స్ తో పాటు స్టేజిపై తన కత్తిసాము చూపించింది. టార్గెట్ షాలిని అని చెప్పి అరుస్తావు, రోహిత్ చాటు ఉంటావు, గేమ్ కనపడట్లేదు అని చెప్తుంటే షాలిని వినకుండా రివర్స్ నీతూ పై అరిచింది. నెక్స్ట్ వంశీ అని చెప్పింది. అలాగే నీతూకి కూడా సేఫ్టీ బ్యాడ్జెస్, సూట్ కేస్ ఇచ్చారు. మ్యాజిక్ పవర్ టాస్క్ చెప్పారు. ఆమె లోపలి వెళ్ళేలోపు షాలిని తర్వాత కూడా ఆమె తప్పుని అర్ధం చేసుకోకుండా నీతు గురించి రోహిత్ దగ్గర మాట్లాడింది. నీతూ హౌస్ లోకి వెళ్ళాక సేఫ్ బ్యాడ్జ్ నరేష్, రోహిత్ లకు ఇచ్చింది. మ్యాజిక్ పవర్ టాస్క్ త్రిగున్ తో ఆడతాను అని చెప్పింది. నరేష్ సంచాలక్. ఒక బాల్ రోలింగ్ టాస్క్ ఇచ్చారు. నీతూ నటరాజ్ మాస్టర్ ఈ టాస్క్ లో గెలిచి త్రిగున్ మ్యాజిక్ పవర్ ని గెలుచుకుంది. షాలిని వచ్చి ఆడి గెలవండి అన్నందుకు నాగార్జున గెలిచింది అని షాలిని కౌంటర్ ఇచ్చాడు.

Also Read : Swetha Naidu : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. శ్వేతా నాయిడు గురించి తెలుసా?

నాలుగో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా డ్యాన్సర్ శ్వేతా నాయుడు డ్యాన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. స్టేజిపై మాట్లాడింది. పాడింది. దేబ్జానీని ఇమిటేట్ చేసింది. షాలిని డేంజర్ అని చెప్పింది. టార్గెట్ విషయంలో శ్వేతా కూడా షాలిని అరవడం గురించే చెప్పింది. రోహిత్ షాలిని వల్ల తన ఆట పక్కకు వెళ్ళిపోతుంది అని చెప్పింది. శ్వేతకు కూడా స్టే బ్యాడ్జెస్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చారు. మ్యాజికల్ పవర్ టాస్క్ గురించి చెప్పారు. శ్వేతా నాయుడు లోపలి వెళ్ళాక తన సేఫ్ బ్యాడ్జెస్ లో రోహిత్ కి ఒకటి, నరేష్ కి ఒకటి ఇచ్చింది. మ్యాజిక్ పవర్ టాస్క్ కోసం వంశీతో ఛాలెంజ్ చేసింది. సంచాలక్ త్రిగున్. టాస్క్ లో వంశీ గెలిచాడు. మ్యాజిక్ పవర్ అతని దగ్గరే ఉంది. దీంతో 2 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాయి. శ్వేతకు హౌస్ క్లీనింగ్ పనిషమెంట్ ఇచ్చారు.

ఐదో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష కంటెస్టెంట్ రామకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే రెండు సార్లు చివరి దాకా వచ్చి వెళ్లిపోయిన రామకృష్ణ ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రామకృష్ణ కూడా టార్గెట్ షాలిని, రోహిత్ అనే చెప్పాడు. అందరూ చెప్పే కారణాలే చెప్పారు. రామకృష్ణకు కూడా సేఫ్టీ బ్యాడ్జెస్, మ్యాజికల్ పవర్ టాస్క్, డబ్బులు ఉన్న సూట్ కేస్ ఇచ్చారు. రామకృష్ణ లోపలి వెళ్ళాక సేఫ్టీ బ్యాడ్జెస్ నరేష్, రోహిత్ లకు ఇచ్చాడు.

రోహిత్, నరేష్, ముకేశ్ లకు సేఫ్ బ్యాడ్జ్ లు రావడంతో నామినేషన్స్ ఉంచి వీళ్ళు సేవ్ అయ్యారు. మిగిలిన చరణ్, షాలినిలను ఒక రూమ్ లో ఉంచారు. వాళ్ళిద్దరిలో ఎవర్ని పంపించాలి, ఎవర్ని ఉంచాలి అని ఓట్లు బ్యాలెట్ బాక్స్ లో వేయమన్నారు. ఎవరికి రాసారో ఆది కెమెరాకు చుపించమన్నారు. చరణ్ కి ఒక్క ఓటు రాగా మిగతా అందరూ షాలిని ఉండాలని రాసారు. దీంతో చరణ్ ఎలిమినేట్ అయ్యాడు.

Also Read : Swetha Naidu : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. శ్వేతా నాయిడు గురించి తెలుసా?

ఓట్లు గురించి షాలిని, రోహిత్, అమన్ మధ్య డిస్కషన్ జరిగింది. అమన్ ఒక్కడే చరణ్ కి ఓట్ వేసాడు ఎందుకు వేశావు అని షాలిని, రోహిత్ ప్రశ్నించారు. ఎక్కువ షాలిని కి వేస్తారు అని ఊహించి నేను చరణ్ కి వేసా అన్నాడు. రోహిత్ అలా ఎందుకు అనుకున్నావు ఒకవేళ అందరూ చరణ్ కి వేస్తే ఏం చేస్తావు అంటే చరణ్ ఏం చేసాడు అని అతనికి ఓట్లు వేస్తారు అని ఉన్న నిజం చెప్పడంతో రోహిత్ ఫేస్ మాడిపోయింది. షాలినికి వేయకుండా ఆ ఒక్క ఓటు చరణ్ కి వెళ్లినందుకు రోహిత్, షాలిని ఫీల్ అయినట్టు వాళ్ళ మాటల్లో, ఫేస్ లలో చూపించారు.

అనంతరం చరణ్ స్టేజిపైకి వచ్చాడు. ముందొక మాట వెనక ఒక మాట చెప్పే ముగ్గురు పేర్లు చెప్పమన్నారు నాగార్జున. త్రిగున్, ఝాన్సీ, సుధీర్ పేర్లు చెప్పాడు. తన ఆటని అందరూ ప్రశ్నించడం, మళ్ళీ అందరూ ఓట్లు వేసి నామినేషన్ నుంచి సేవ్ చేయడంతో షాలిని సైలెంట్ అయిపొయింది. నాగార్జున మాట్లాడించడంతో ఎమోషనల్ అయి బాగా ఆడతాను అని చెప్పింది. బయటి నుంచి వచ్చిన వాళ్లంతా షాలిని గురించి బయట ఉన్న నిజాలు చెప్పారు కానీ షాలిని తీసుకోలేకపోయింది. మరి ఇప్పటికైనా మారుతుందా చూడాలి.

ఇక రామకృష్ణ మ్యాజికల్ పవర్ టాస్క్ కి రామ్ ప్రసాద్ ని ఛాలెంజ్ చేసాడు. సంచాలక్ అమన్. ఈ టాస్క్ లో రామ్ ప్రసాద్ గెలిచాడు. దీంతో మ్యాజిక్ పవర్ అతని దగ్గరే ఉంది. మరో 2 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాయి. రామకృష్ణ పనిషమెంట్ గా కిచెన్ డ్యూటీ ఇచ్చారు. మొత్తానికి ఈ వారం ఇద్దర్ని ఎలిమినేట్ చేసి అయిదుగురిని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా తీసుకొచ్చారు. నెక్స్ట్ వారం అవతారం రోడ్ బ్లాక్ అని ప్రకటించాడు బిగ్ బాస్. ఇక రేపు సోమవారం నుంచి కొత్త కంటెస్టెంట్స్ తో మరింత కొత్తగా ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ 10.

Also Read : Shiva Kumar : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. శివ కుమార్.. ఇతని గురించి తెలుసా?