Rama Krishna : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. అగ్నిపరీక్ష రామకృష్ణ గురించి తెలుసా?
చివరగా ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా రామకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. (Rama Krishna)
Rama Krishna
Rama Krishna : ఈ వారం ఎలిమినేషన్ తో పాటు అయిదుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా వస్తారని నిన్నే ప్రకటించారు నాగార్జున. చెప్పినట్టే నేడు మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా సీరియల్ నటుడు శివకుమార్, రెండో వైల్డ్ కార్డు ఎంట్రీగా నటి దక్షి గుత్తికొండ, మూడో వైల్డ్ కార్డు ఎంట్రీగా నీతూ నటరాజ్ మాస్టర్, నాలుగో వైల్డ్ కార్డు ఎంట్రీగా డ్యాన్సర్ శ్వేతా నాయుడు ఎంట్రీ ఇచ్చారు. చివరగా ఐదో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా రామకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : Swetha Naidu : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కంటెస్టెంట్.. శ్వేతా నాయిడు గురించి తెలుసా?
శ్రీకాకుళం కి చెందిన రామకృష్ణ చదువు తర్వాత పోలీస్ జాబ్, గవర్నమెంట్ జాబ్ లకు ప్రిపేర్ అవుతూ, సోషల్ మీడియాలో పలు వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్నాడు. అగ్నిపరీక్షకు అప్లై చేసి ఫైనల్ కి వచ్చాడు. మొదటి ఛాన్స్ లో బిగ్ బాస్ కి సెలెక్ట్ అవ్వలేదు. రెండో సారి మిథిలేష్ తో గేమ్ లో ఓడిపోయి ఎంట్రీ అవ్వలేదు. ఇప్పుడు మూడో అవకాశంలో రామకృష్ణ బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చాడు.
View this post on Instagram
