Bigg Boss 7 : రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్.. తేజాతో ఆడుకున్న బిగ్‌బాస్
కొత్తగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత ఆసక్తికరంగా మారింది.
- Thota Vamshi Kumar
- Published On : October 10, 2023 / 07:09 PM IST
Bigg Boss Telugu 7 Day 37 Promo
Bigg Boss Telugu 7 : కొత్తగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత ఆసక్తికరంగా మారింది. ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన బిగ్‌బాస్ శుభ శ్రీ ని ఎలిమినేట్ చేయగా గౌతమ్‌ను సీక్రెట్ రూమ్‌లో పంపించిన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోలను విడుదల చేశారు. ఓ ప్రొమోలో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో గౌతమ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
Big Boss 7 : బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి గుండెపోటు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..
‘రాననుకున్నారా..? రాలేనని అనుకున్నారా..? అశ్వత్థామ ఈజ్ బ్యాక్.. తేనె పూసిన కత్తిని గొంతులో దింపారు కదా’ అంటూ వస్తూనే ఆవేశంతో ఊగిపోయాడు. తరువాత బిగ్‌బాస్ అతడికి ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. దీన్ని ఉపయోగించి ఒకరిని డైరెక్ట్ గా నామినేషన్ చేయొచ్చు అని చెప్పాడు. ఆ తరువాత హౌస్‌లో ఉన్న ఆటగాళ్లు, పోటుగాళ్లు ఎవరు బెస్ట్ అని నిరూపించేందుకు ఫిజికల్, మెంటల్ టాస్క్ లను ఇచ్చాడు. మరీ తనకు ఇచ్చిన పవర్‌తో గౌతమ్ ఎవరిని నామినేట్ చేశాడు..? ఆటగాళ్లు, పోటుగాళ్లలో ఎవరు విజేతగా నిలిచారో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
