Big Boss 7 : బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి గుండెపోటు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..

బిగ్ బాస్ షో అంటేనే ఒత్తిడిని కలిగించే షో.. అన్ని ఎమోషన్స్‌ని తట్టుకోగలిగే వారు కంటెస్టెంట్స్‌గా షోకి వస్తుంటారు. గతంలో నటుడు సంపూర్ణేష్ బాబు షోలో ఒత్తిడి తట్టుకోలేక బయటకు వచ్చిన సందర్భం చూసాం. తాజాగా ఓ కంటెస్టెంట్‌కి ఏమైందంటే?

Big Boss 7 : బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి గుండెపోటు.. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆ కంటెస్టెంట్..

Big Boss 7

Updated On : October 10, 2023 / 6:25 PM IST

Big Boss 7 : తమిళ్ బిగ్ బాస్ 7 వ సీజన్ నుండి ప్రముఖ రచయిత బావ చెల్లదురై నిష్క్రమించారు. తీవ్ర ఒత్తిడికి లోనైన ఆయన ఛాతి నొప్పి వస్తోందని చెప్పడంతో బిగ్ బాస్ నిర్వాహకులు బయటకు పంపివేసినట్లు తెలుస్తోంది.

Prithiveeraj : తన కొడుకు కంటే చిన్న అమ్మాయితో పృథ్వి రాజ్ లవ్ స్టోరీ.. బిగ్ బాస్‌కి ఎందుకు వెళ్ళలేదంటే?

తమిళ బిగ్ బాస్‌కి మంచి పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. ఏడో సీజన్‌ని కూడా కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 7 న గ్రాండ్‌గా ఈ షో లాంచ్ అయ్యింది. ఈ షోకి వచ్చిన కంటెస్టెంట్‌లలో ఒకరైన నటుడు, ప్రముఖ రచయిత బావ చెల్లదురై తీవ్ర అనారోగ్య సమస్యలతో షో నుంచి బయటకు వెళ్లిపోయారు. తనకు ఛాతి నొప్పి వస్తోందని.. తను హౌస్‌లో ఉండలేనని.. తనను ఇంటికి పంపమని ఆయన వేడుకోవడంతో హౌస్ నుంచి బయటకు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్‌లో నవ్వులు.. కోపాలు.. కోట్లాటలు.. ప్రేమలు అన్ని ఎమోషన్స్ నిండి ఉంటాయి. ఇక టాస్క్‌లు, నామినేషన్లు వచ్చాయంటే యుద్ధాలే జరుగుతాయి. వీటన్నింటికీ తట్టుకోగలిగే వారు అందులో ఉండగలుగుతారు. బావ చెల్లదురై వయసు రీత్యా పెద్దవారైనా ఈ గేమ్ గురించి అవగాహనతోనే ఎంట్రీ ఇచ్చారు. ఫిజికల్ టాస్క్‌లలో యాక్టివ్‌గా ఉండకపోవడంతో తోటి కంటెస్టెంట్లు ఆయనను ఈ వారం నామినేట్ చేసారు. దీంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో తనకు ఛాతీలో నొప్పి వస్తోందని.. బయటకు వెళ్లిపోతానని రిక్వెస్ట్ చేయడంతో నిర్వాహకులు ఆయనను బయటకు పంపించారు.

Mahesh Vitta : సైలెంట్‌గా పెళ్లి చేసేసుకున్న బిగ్ బాస్ ఫేమ్, కమెడియన్ మహేష్ విట్టా.. అమ్మాయి ఎవరో తెలుసా?

గతంలో తెలుగు బిగ్ బాస్‌లో నటుడు సంపూర్ణేష్ బాబు కూడా హౌస్‌లో ఉండలేనని పట్టుబట్టి మరీ బయటకు వచ్చేసారు. బావ చెల్లదురై అనారోగ్య సమస్యలతో బిగ్ బాస్ షో నుంచి నిష్క్రమించారు.