Bigg Boss Day 80 Promo
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్లకు భోజనం పెట్టిన మిసెస్ బిగ్‌బాస్ ను ఎవరో హత్య చేశారని చెబుతాడు బిగ్‌బాస్. ఆ హంతకులని పట్టుకోవాలని ఇన్వెస్టిగేట్ ఆఫీసర్స్ అయిన అమర్ దీప్, అర్జున్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రొమో విడుదలైంది. పోలీస్ గెటప్‌లో అమర్ కామెడీని పండించే ప్రయత్నం చేశాడు.
అర్జున్ మాట్లాడుతూ.. నేను ఇన్‌స్పెక్టర్ ఇంద్రజిత్, ఇతను కానిస్టేబుల్ అని చెప్పగా, కాదు నేను మీలాగానే ఎస్సైని అని చెప్పారంటూ అమరదీప్ అన్నారు. శోభా శెట్టి, అశ్విని లు న్యూస్ రిపోర్టర్స్‌గా కనిపించారు. డ్రైవర్‌గా రతిక, పనోడిగా గౌతమ్ లు పోషించారు. అనంతరం బిగ్‌బాస్ శివాజీని కన్‌సెషన్ రూమ్‌లోకి పిలిచి నక్లెస్ ఇచ్చి టాస్క్ చేయాలని చెబుతాడు.
సీక్రెట్ టాస్క్‌లో భాగంగా తాను చెప్పేంత వరకు బయటకు రావొద్దని ప్రశాంత్‌కు శివాజీ చెబుతాడు. ప్రశాంత్ స్టోర్ రూమ్‌లో ఉండగా.. అతడి కోసం ప్రశాంత్ ఇళ్లంతా వెతికేస్తుంటాడు. ఆ తరువాత నువ్వు నాకు నచ్చలేదు అమర్ అంటూ శోభా అనగా వెంటనే చేతిలో ఉన్న లాఠీని విసిరికొట్టేశాడు అమర్. నువ్వు గట్టిగా మాట్లాడితే నీ కంటే గట్టిగా మాట్లాడతాను అంటూ అశ్విని పై అమర్ ఫైర్ అవుతాడు. మొత్తంగా ప్రొమోలు ఆకట్టుకున్నాయి.