Bigg Boss Nominations : ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..?
ఇక నామినేషన్స్ అంటే గొడవలు, అరుపులు అని తెలిసిందే.
- Saketh U
- Published On : October 16, 2024 / 09:46 AM IST
Bigg Boss Telugu Season 8 Seventh Week Nominations Full List Here
Bigg Boss Nominations : బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటికే ఆరువారాలు ముగిసి ఏడో వారం సాగుతుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్ సోమ, మంగళవారం ఎపిసోడ్స్ లో సాగాయి. బిగ్ బాస్ లో ఉన్న కంట్రస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి ఆడిస్తున్నారు. ఇక నామినేషన్స్ అంటే గొడవలు, అరుపులు అని తెలిసిందే. ముఖ్యంగా ఈ సారి నామినేషన్స్ లో నబిల్, పృథ్వీ, ప్రేరణ.. ఇలా పలువురు మరీ ఓవర్ గా రియాక్ట్ అయి గొడవలు పెట్టుకున్నారు.
నామినేషన్స్ గొడవ ముగిసి గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, నాగ్ మణికంఠ, అవినాష్ నామినేషన్స్‌లోకి రాగా టోపీ టాస్క్ ప్రకారం తక్కువసార్లు టోపీ పట్టుకుందని ప్రేరణని బిగ్ బాస్ నామినేట్ చేసాడు. అయితే ఓజీ క్లాన్ దగ్గర ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఒకర్ని సేవ్ చేసుకొని వాళ్ళ బదులు ఇంకొకరిని పెట్టాలి అని చెప్పడంతో అవినాష్ తన బదులు హరితేజని నామినేషన్స్ లోకి పంపాడు. మొత్తంగా ఈ వారం గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, నాగ్ మణికంఠ, ప్రేరణ, హరితేజ.. ఇలా తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
