Bigg Boss Elimination : బిగ్ బాస్ లో డబల్ ఎలిమినేషన్.. చరణ్ తర్వాత ఈ వీకెండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఈ వారం మరో ఎలిమినేషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. (Bigg Boss Elimination)
- Saketh U
- Published on- September 11, 2026 / 02:16 PM IST
Bigg Boss Elimination
Bigg Boss Elimination : బిగ్ బాస్ పదో సీజన్ కావడంతో ఈసారి మరింత రసవత్తరంగా కొత్త కొత్త టాస్కులు, కొత్త నియమాలతో సాగుతుంది. దానికి తోడు అగ్నిపరీక్ష టీమ్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు సాగుతుంది. ఇప్పటికే నాలుగు రోజులు పూర్తవగా నాలుగో రోజే మొదటి ఎలిమినేషన్ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన చరణ్ ని రోహిత్ బలిపశువు చేసి బయటకు వెళ్లిపోయేలా చేసాడు.
అయితే ఈ వారం మరో ఎలిమినేషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ వీకెండ్ కి ఓట్లు, లోపల టాస్కుల ఆధారంగా మరో ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. ఓట్ల పరంగా చూస్తే అందరికంటే తక్కువగా చైత్ర, సృష్టి, వర్షిణి, సుధీర్, కృష్ణుడు ఉన్నారు. అయితే వీరిలో చైత్ర, కృష్ణుడు లని తమ టీమ్స్ హై రిస్క్ లో పెట్టాలనుకున్న సంగతి తెలిసిందే.
Also Read : Jabardasth Ram Prasad : రామ్ ప్రసాద్ కోసం సుడిగాలి సుధీర్ ఎంట్రీ.. ఇక బిగ్ బాస్ కప్ అతనిదే..?
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లతో చైత్ర హై రిస్క్ లో ఉంది. అలాగే చైత్రకి కొంచెం హెల్త్ కూడా బాగోలేదు. నిన్నే ఎలిమినేషన్ నుంచి సేవ్ అయి వచ్చింది. దీంతో ఈ వారం చైత్ర ఎలిమినేట్ అవుతుందని భావిస్తున్నారు. కృష్ణుడు టాస్క్ లలో ఎక్కువ యాక్టివ్ గా ఉండట్లేదు, ఓటింగ్ శాతం కూడా తక్కువే ఉంది. దీంతో కృష్ణుడుకు కూడా ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.
