Sohel Debut film: సోహెల్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఫైనల్ వరకు వెళ్లి, రూ.25 లక్షలతో వెనుదిరిగాడు.. టైటిల్ గెలవకపోయినా తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు అతను. సినిమాల్లో నటించాలనేది తన కల అని చెప్పాడు సోహెల్.. హౌస్‌లో నుండి బయటకొచ్చిన కొద్ది రోజుల్లోనే అతని కల నెరవేరబోతుంది. సోహెల్ హీరోగా నటించబోయే ఫస్ట్ సినిమాను గురువారం అధికారికంగా ప్రకటించారు.
‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ సినిమాలను నిర్మించిన అప్పి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. డైరెక్టర్ బౌండెడ్ స్క్రిప్ట్‌తో సోహెల్‌ను కలిసి కథ చెప్పగా సింగిల్ సిట్టింగ్‌లోనే కన్ఫమ్ చేసెయ్యడం విశేషం.
బిగ్ బాస్ సోహెల్ కెరీర్‌కు మంచి ప్లస్ అయ్యిందని, హీరోగా తన కొత్త ప్రయాణం ఆనందంగా సాగిపోవాలని ఫ్యాన్స్, ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.