BiggBoss 6: బిగ్బాస్ సీజన్ 6 మొదటివారం పూర్తిచేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇక బిగ్బాస్ రూల్స్ ప్రకారం నామినేషన్స్ లో ఉన్న వారిలో, ప్రతివారం ఒకొక్కరిగా ఎలిమినేట్ అవుతూ హౌస్ నుంచి బయటకి వస్తారు. మొదటి వారం ఎలిమినేషన్ కు చంటి, రేవంత్, శ్రీ సత్య, ఆరోహి, ఇనయా, అభినయశ్రీ, ఫైమా నామినేట్ కాగా.. వీరిలో ఒకరు బయటకి వచ్చేస్తారు అనుకున్నారు అంతా.
కానీ అన్ని మనం అనుకున్నట్టు జరిగితే అది బిగ్బాస్ షో ఎందుకు అవుతుంది. ఈ సీజన్ లో మొదటివారం ఎలిమినేషన్ తీసేస్తున్నట్టు నాగార్జున ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ, రెండోవారం నామినేషన్స్ తో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో తెలుస్తుంది.
ప్రతిసారిలా కాకుండా ఈ వారం ప్రతి ఒక్క హౌస్మేట్కు నామినేట్ చేయడానికి గాను కేవలం ఒక ఓటు మాత్రమే ఇస్తున్నట్టు ప్రోమోలో బిగ్బాస్ తెలిపాడు. కంటెస్టెంట్స్ వారి హక్కుని ఉపయోగించుకుని నామినేషన్స్ చేయడంతో ఒకరి మధ్య ఒకరికి మాటల యుద్ధం జరిగింది, ముఖ్యంగా ఆదిరెడ్డి, రేవంత్, గీతూ రాయల్, కీర్తి.. ల మధ్య తారాస్థాయిలో జరిగిన మాటల యుద్ధం చూస్తుంటే, పోటీ రసవత్తరంగా మారినట్టు ప్రోమోలో కనిపిస్తుంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు నిలవనున్నారో తెలియాలంటే.. సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్ చూసి తెలుసుకోవాల్సిందే.