BiggBoss Sivaji : మేము ఇలా ఉన్నామంటే నాగార్జున, చిరంజీవి కారణం.. శివాజీ భార్య కామెంట్స్ వైరల్..

శివాజీ భార్య శ్వేత బిగ్‌బాస్ వేదిక పై మాట్లాడుతూ.. మేము ఇలా ఉన్నామంటే నాగార్జున, చిరంజీవి కారణం అంటూ తెలియజేశారు.

BiggBoss Sivaji wife swetha about Chiranjeevi Nagarjuna Video viral

BiggBoss Sivaji : టాలీవుడ్ హీరో శివాజీ.. తెలుగు బిగ్‌బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ కంటెస్టెంట్స్‌లో శివాజీనే స్ట్రాంగ్ ప్లేయర్ గా ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నారు. కాగా ఈ ఆదివారం దీపావళి పండగ సందర్భంగా కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులను నాగార్జున బిగ్‌బాస్ వేదిక పైకి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే శివాజీ సతీమణి శ్వేత, చిన్న కొడుకు రిక్కీ కూడా వచ్చారు.

ఇక ఈ వేదిక పై శ్వేత.. నాగార్జున, చిరంజీవి గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్ వేదిక పై నాగార్జునతో శ్వేత మాట్లాడుతూ.. “మేము ఇలా ఉన్నామంటే దానికి మీరు, చిరంజీవి గారే కారణం. అది ఇప్పటికీ ఇంకా గుర్తు ఉంది సార్” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈమె మాటలకు నాగార్జున స్పందిస్తూ.. “నేను చిరంజీవి గారు కాదమ్మా అందుకు కారణం. మీ భర్త టాలెంట్” అంటూ బదులిచ్చారు.

Also read : Maa Oori Polimera 2 : థియేటర్స్‌లో తగ్గని పొలిమేర 2 జోరు.. కోట్ల వర్షం కురిపిస్తూ..

నాగార్జున మాటలకు శివాజీ బదులిస్తూ.. “మీ గురించి ఇక్కడ ఉన్నవారికి ఎవరికి పెద్దగా తెలియదు సార్. అన్నపూర్ణ స్టూడియో ద్వారా ఎంతోమంది కొత్తవారిని ప్రోత్సహించారు, ఆదరించారు, వారికీ అన్నం పెట్టడం నేను స్వయంగా చూశాను. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు అండి, కానీ మంచితనం ఉండడం చాలా అరుదు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శివాజీ మాటలకు నాగార్జున కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని నాగార్జున అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక బిగ్‌బాస్ ద్వారా శివాజీ తన సతీమణి శ్వేతని అందరికి తెలియజేశారు. ఇటీవల శివాజీ పెద్దకొడుకు శ్రీ.. హౌస్ లోకి సర్‌ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు దివాళీ సందర్బంగా చిన్న కొడుకు రిక్కీ అందరి ముందుకు వచ్చాడు. రిక్కీ తన అన్న శ్రీలా సైలెంట్ కాదు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ని ఒక ఆట ఆడేసుకున్నాడు. భోలెని హీరో అంటూ, శోభాని ఆంటీ అంటూ ఇలా అందర్నీ నవ్వించేశాడు.