Maa Oori Polimera 2 : థియేటర్స్‌లో తగ్గని పొలిమేర 2 జోరు.. కోట్ల వర్షం కురిపిస్తూ..
సత్యం రాజేష్ నటించిన 'మా ఊరి పొలిమేర 2' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.

Satyam Rajesh Maa Oori Polimera 2 movie collections report
Maa Oori Polimera 2 : సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో చేతబడుల కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ‘మా ఊరి పొలిమేర’. 2021లో డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఆ సినిమా ఎండింగ్ లో అదిరిపోయే ట్విస్ట్ పెట్టడంతో.. ఆడియన్స్ లో సీక్వెల్ పై మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. దీంతో మేకర్స్ కూడా సీక్వెల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశారు.
ఈసారి ఈ సీక్వెల్ ని థియేటర్ లో రిలీజ్ చేశారు. నవంబర్ 3న ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయ్యింది. ఇక థియేటర్స్ లో ఈ సీక్వెల్ ఆ అంచనాలకు తగ్గట్టు ఉండడంతో.. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి సినిమాని థియేటర్ లో మిస్ అయిన ఆడియన్స్.. ఈ సీక్వెల్ ని మాత్రం థియేటర్స్ లోనే చూసి థ్రిల్ ఫీల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా సాధించేసింది. డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు వెళ్తుంది.
Also read : Rajinikanth : మనవళ్లుతో రజినీకాంత్ దివాళీ సెలబ్రేషన్స్..
ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాల రిలీజ్‌లు ఏమీ లేవు. దీంతో ఈ కలెక్షన్స్ జోరు ఇలాగే కొనసాగుతూ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. సత్యం సినిమాతో మంచి ఫేమ్ ని సంపాదించుకొని ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న రాజేష్.. ఇప్పుడు పొలిమేర చిత్రంతో ఇంతటి బ్లాక్ బస్టర్ అందుకొని పొలిమేర రాజేష్ అయ్యిపోయారు. కాగా ఈ సినిమాలో రాజేష్ తో పాటు డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, సాహితి దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు.
#polimera2 Huge Double Block Buster pic.twitter.com/cEgriBycS3
— T2BLive.COM (@T2BLive) November 13, 2023