BiggBoss Srihan Maa Awara Zindagi Movie review
Maa Awara Zindagi Review : బిగ్‌బాస్ శ్రీహన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే నటీ నటులుగా దేపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన యూత్ ఫుల్ ఫన్ ఓరియెంటెడ్ మూవీ “మా ఆవారా జిందగీ” (జీరో% లాజిక్ 100% ఫన్) అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా, ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు. నేడు జూన్ 23న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. ఎంజాయిమెంట్ కి అలవాటు పడిన నలుగురు కుర్రాళ్ళు పనిపాట లేకుండా తిరగడం, ఎంజాయ్ చేయడం, తాగడం చేస్తూ ఉంటారు. ఇలా ఏదో ఒక ఎదవ పని చేసి ప్రతిసారి పోలీసుల దగ్గర ఇరుక్కుంటారు. ట్యాగ్ లైన్ లో చెప్పినట్టు లాజిక్ లేకుండా కేవలం ఫన్ ఉండేలా సీన్స్ రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ నలుగురు కుర్రాళ్ళు చేసే కామెడీ సీన్స్ తో నవ్వుకుంటారు. ఇంటర్వెల్ లో ఓ ఆసక్తికర ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులని సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసేలా చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో కూడా మొత్తం ఫన్ తోనే నడిపించి ఇంటర్వెల్ ట్విస్ట్ ఏమైపోయిందా అనే సమయానికి క్లైమాక్స్ లో అన్ని లింక్ చేసి ఆశ్చర్యపరుస్తారు. క్లైమాక్స్ ఎమోషనల్ గా చూపించినట్టే చూపించి మళ్ళీ అందరూ నవ్వుకునేలా చేశారు.
Ram Charan : మెగా ప్రిన్సెస్‌తో రామ్ చరణ్ వీడియో చూశారా.. నెట్టింట వైరల్!
మొత్తానికి ఎలాంటి లాజిక్ లేకుండా ఓ రెండు గంటల పాటు నలుగురు కుర్రాళ్ళు నవ్విస్తే ఎలా ఉంటుంది అని సినిమాలో చూపించారు. ఇందులో చాలా మందికి ఇదే మొదటి సినిమా అయినా బాగా నటించారు. ఇక బిగ్‌బాస్ శ్రీహన్ ఇన్నాళ్లు యూట్యూబ్ లో మెప్పించి ఇప్పుడు సినిమాతో కూడా మెప్పించాడు. జబర్దస్త్ అవినాష్ తమ్ముడు అజయ్ తన కామెడీతో నవ్విస్తాడు. జస్వంత్ తన హైట్ తో, కొన్ని సీన్స్ లో తన నటనతో ఫుల్ గా నవ్విస్తాడు. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేస్తుంది.