×
Ad

Fan Wars : నాగార్జున కటౌట్స్ తగలబెట్టిన కృష్ణ ఫ్యాన్స్.. ఇండస్ట్రీలో ఇదే పెద్ద ఫ్యాన్ వార్.. కానీ సినిమా సూపర్ హిట్..

సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ ఫ్యాన్స్ గొడవలు మొదలయ్యాయి. (Fan Wars)

  • Published On : March 9, 2026 / 09:47 AM IST

Fan Wars

  • ఇండస్ట్రీలోని ఓ పెద్ద ఫ్యాన్ వార్
  • నాగార్జున – కృష్ణ మల్టీస్టారర్ సినిమాకు
  • థియేటర్స్ దగ్గర గొడవలు చేసిన ఫ్యాన్స్

Fan Wars : ఇటీవల సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని ఖాళీగా ఉన్నవాళ్లు సోషల్ మీడియాలో భూతులతో రెచ్చిపోతూ ఒకర్నొకరు తిట్టుకుంటూ హీరోలని కించపరుస్తూ రాక్షసానందం పొందుతారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఉంది కానీ ఒకప్పుడు ఫ్యాన్ వార్స్ అంటే బయట కొట్టుకునేవాళ్ళు కూడా. థియేటర్స్ దగ్గర గొడవలు పడేవాళ్ళు.

అలాంటి ఓ పెద్ద ఫ్యాన్ వార్ ఓ మల్టీస్టారర్ సినిమాకు జరిగింది. నాగార్జున – కృష్ణ కలిసి నటించిన వారసుడు సినిమాకు భారీ ఎత్తున ఫ్యాన్ వార్స్ జరిగాయి.

Also Read : Sushmita Konidela : బాబాయ్ భయపెట్టేవాడు.. పవన్ కళ్యాణ్ పై చిరు కూతురు కామెంట్స్ వైరల్..

హిందిలో బ్లాక్ బస్టర్ అయిన ఫూల్ ఔర్ కాంట్ మూవీ రీమేక్ గా మురళీమోహన్ నిర్మాణంలో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున – కృష్ణ కాంబినేషన్ లో వారసుడు సినిమా తెరకెక్కించారు. ముందు కృష్ణ పాత్రని మురళీమోహన్ చేద్దామనుకున్నారు కానీ ఓ ఫ్లాప్ సెంటిమెంట్ తో ఆగిపోయారు. కృష్ణ ఫస్ట్ ఈ సినిమా తండ్రి పాత్ర అని ఒప్పుకోలేదు. వేరేవాళ్లను ట్రై చేసినా వర్కౌట్ అవ్వకపోవడంతో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి కృష్ణ పాత్రకు ఎలివేషన్స్ పెట్టడంతో రిక్వెస్ట్ మీద ఒప్పుకున్నారు.

ఈ సినిమా ఓపెనింగ్ కి నాగార్జున ఫ్యాన్స్ ప్రాసెడింట్ తో క్లాప్ కొట్టించడం గమనార్హం. ఈ సినిమాని ఆల్మోస్ట్ 92 రోజుల్లో తెరకెక్కించారు. దాదాపు ఈ సినిమాకు రెండున్నర కోట్లు బడ్జెట్ అయింది. అప్పటికి ఇది ఎక్కువే. 1993 మే 5న వారసుడు సినిమా రిలీజ్ అయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ ఫ్యాన్స్ గొడవలు మొదలయ్యాయి.

Fan Wars

ఇద్దరు టాప్ హీరోల మల్టీస్టారర్ కావడంతో బ్యానర్లు విషయంలో అన్ని థియేటర్స్ వద్ద ఫాన్స్ మధ్య పోటీలు, గొడవలు అయ్యాయి. కటౌట్స్ విషయంలో గొడవలు అయ్యాయి. సినిమాలో కృష్ణ పాత్ర తక్కువుగా ఉందని, నాగార్జున కృష్ణని వాడు వీడు అనడం, కాలర్ పట్టుకోవడం.. లాంటి కొన్ని సీన్స్ కృష్ణ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దాంతో ఆ సీన్స్ తీసేయాలని, కృష్ణ పై ఒక సాంగ్, ఒక ఫైట్ పెట్టాలని ఘట్టమనేని ఫ్యాన్స్ డిమాండ్ చేసారు. ఈ డిమాండ్స్ తో ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర రచ్చ చేసారు. చాలా చోట్ల నాగార్జున కటౌట్స్ తగలబెట్టారు, కొన్ని చోట్ల థియేటర్స్ లో బాక్సులు పగలకొట్టారు. ఇలా భారీగానే ఫ్యాన్స్ గొడవలు అయ్యాయి.

Also Read : Virosh : విజయ్ – రష్మిక పెళ్ళికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది..? విజయ్ ఆడిటర్ ఏమన్నాడంటే..

పెద్ద గొడవలు అవ్వడంతో కృష్ణ, నాగార్జున, ఈవీవీ.. ఓ వివరణ ఇస్తూ పత్రికా ప్రకటన ఇచ్చారు. చివరికి సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేసి, కృష్ణతో ఒక ఫైట్ తీసి సినిమాలో క్లైమాక్స్ లో యాడ్ చేసారు. అప్పటికి కానీ కృష్ణ ఫాన్స్ కూల్ అయ్యారు. ఇన్ని వివాదాలు, గొడవలు అయినా సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది. రెండున్నర కోట్లతో ఈ సినిమాని తీస్తే ఆల్మోస్ట్ ఆరున్నర కోట్లు వసూలు చేసింది. వంద రోజులు ఆడింది ఈ సినిమా. అప్పటికి ఇప్పటికి ఫ్యాన్స్ వార్స్ ప్లేసులు మారినా జరగడం మాత్రం మానట్లేదు. హీరోలు అంతా ఒక్కటే అని వాళ్ళు బాగున్నా ఫ్యాన్స్ మాత్రం అర్ధం పర్థం లేకుండా ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు.