micheal jackson
Michael Jackson : సంగీత ప్రపంచానికి రారాజు అనిపించుకున్న పాప్ కింగ్ ‘మైఖేల్ జాక్సన్’ బయోపిక్ తెరకెక్కబోతుంది అన్న వార్త వరల్డ్ వైడ్ గా ఉన్న మైఖేల్ అభిమానులు ఎంతగానో సంతోష పరుస్తుంది. అతని పాటలతో, డాన్స్ లతో ఒక కొత్త స్టైల్ ని పరిచయం చేసి తనకంటూ ఒక కొత్త చరిత్రను రాసుకున్నాడు. పది ఏళ్ళ వయసులోనే పాడడం మొదలు పెట్టిన మైఖేల్ దాదాపు 40 ఏళ్ళ పాటు సంగీత ప్రపంచంలో భాగంగా ఉన్నాడు. మైఖేల్ జాక్సన్ తన కెరీర్ లో 150 పైగా పాటలు రిలీజ్ చేశాడు. బీట్ ఇట్ , థ్రిల్లర్ , బ్లాక్ ఆర్ వైట్ , స్మూత్ క్రిమినల్, బిల్లీ జీన్ వంటి పాటలు బాగా ఫేమస్ అయ్యాయి.
మైఖేల్ జాక్సన్.. నిన్నెందుకు మర్చిపోతాం!
మైఖేల్ పాటల్లో 13 సాంగ్స్ గ్రామీ అవార్డులు అందుకున్నాయి. ఈ 13 పాటలు అమెరికాలో నంబర్ 1 గా నిలిచాయి. వరల్డ్ వైడ్ గా మైఖేల్ జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా. మైఖేల్ పాప్ రంగంలోనే కాదు సోషల్ సర్వీస్ లో కూడా రారాజు అనిపించుకున్నాడు. తన జీవితంలో దాదాపు 300మిలియన్ల యూఎస్ డాలర్లు వరకు దానధర్మాలు చేసినట్లు సమాచారం. అంతేకాదు కేన్సర్ మరియు ఇతర వ్యాధులు వచ్చి బాధ పడుతున్న పిల్లలను.. తన జూ అండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్ కి ఆహ్వానించి వారిలో ఆత్మధైర్యాని పెంచడానికి ప్రయత్నించేవాడు.
ఇంతటి లెజెండ్ బయోపిక్ ని తెరకెక్కించేందుకు ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మూవీకి ‘మైఖేల్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. అంటొనియా ఫుకో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. మూడుసార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న జాన్ లోగన్ ఈ మూవీకి స్టోరీ అందిస్తున్నాడు. మైఖేల్ జాక్సన్ పాప్ జీవితంతో పాటు అతని లైఫ్ లో ఉన్న అన్ని కోణాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇక మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన తమ్ముడు కొడుకు జాఫర్ జాక్సన్ నటించినబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జాఫర్ ట్వీట్ చేశాడు. మైఖేల్ అంకుల్ జీవిత కథలో నటించడం నాకు ఎంతో గౌరవంగా ఉంది అంటూ తెలియజేశాడు.
I’m humbled and honored to bring my Uncle Michael’s story to life. To all the fans all over the world, I’ll see you soon.
Photo by Jourdynn Jackson pic.twitter.com/Xow9Mkakup
— Jaafar Jackson (@JaafarJackson) January 30, 2023