SS Rajamouli : హ్యాపీ బర్త్‌డే జక్కన్న
తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు.. టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు నేడు..

Ss Rajamouli
SS Rajamouli: ‘బాహుబలి’ తో తెలుగు సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పుట్టినరోజు నేడు (అక్టోబర్ 10). స్వాతంత్య్ర నేపథ్యంలో ఎన్టీఆర్‌ను కొమురంభీంగా, రామ్ చరణ్‌ను అల్లూరి సీతారామరాజుగా చూపిస్తూ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘RRR – రౌద్రం రణం రుధిరం’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
RRR Release Date : రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి ముందే..
జక్కన్న జన్మదినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తారక్, చరణ్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు జక్కన్నకు విషెస్ చెప్పారు. ‘శాంతినివాసం’ సీరియల్‌తో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన రాజమౌళి ‘స్టూడెంట్ నెం.1’ తో సినిమా దర్శకుడిగా మారారు. ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు.
అప్పటినుంచి ఇప్పటి వరకు ఫ్లాఫ్ అనేదే లేకుండా.. సినిమా సినిమాకి డైరెక్టర్‌గా తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నారు. ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి సినిమాలతో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించారు. భారీ అంచనాలతో 2022 జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కానుంది.
Happy Birthday dear Jakkana @ssrajamouli. Love you ❤️ pic.twitter.com/pCSTgQB1R9
— Jr NTR (@tarak9999) October 10, 2021
I look up to in many ways & admire the strength he portrays through his simplicity. Happy Birthday Rajamouli Garu. @ssrajamouli ?❤️? pic.twitter.com/8tB2EJN7Um
— Ram Charan (@AlwaysRamCharan) October 10, 2021