మీరు టెంప్ట్ అయితే ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటోన్న ఊర్వశి..

  • Publish Date - September 30, 2020 / 06:12 PM IST

Urvashi Rautela – Black Rose: సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో ప్రొడక్షన్ నెం: 4 గా ‘బ్లాక్ రోజ్’ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

రెండు సార్లు మిస్ ఇండియాగా గెలుపొందిన అందాల తార ఊర్వశి రౌతేలా హీరోయిన్‌గా నటిస్తున్న ‘బ్లాక్ రోజ్’ ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. తాజాగా ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ సాగే ప్రమోషనల్ వీడియో సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ విడుదల చేశారు. సోనీ మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది.


ఈ ప్రమోషనల్ సాంగ్‌లో ఊర్వశి రౌతేలా తన అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్ తో విశేషంగా ఆకట్టుకున్నారు. 4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకి జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశారు. స్వతహా మంచి డ్యాన్సర్ అయినా ఊర్వశి ఈ సాంగ్‌లో కష్టమైన డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో అలరించడం విశేషం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ డ్యాన్స్ స్టెప్స్ స్ఫూర్తిగా కంపోజ్ చేసిన డ్యాన్స్‌కి రిహార్సల్స్ చేస్తూ ఊర్వశి పలుమార్లు గాయపడినా నేర్చుకుని చేయడం తనకి ప్రొఫెషన్ పట్ల ఉన్న డెడికేషన్‌కు అద్దం పడుతోంది. ఈ పాట ఆడియన్స్‌కు ట్రీట్‌లా ఉంటుంది.


ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, ‘‘నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. డ్యాన్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ‘బ్లాక్ రోజ్’ నాకు చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నటిగా నాలో ఇంకో కోణాన్ని ఆవిష్కరించే అవకాశం ఇవ్వడమే కాకుండా చాలా కష్టమైన డ్యాన్స్ నేర్చుకుని చేసే అవకాశం ఇచ్చింది.

ఈ పాట షూట్ చేయడానికి ముందు చాలా రిహార్సల్స్ చేశాను. దెబ్బలు కూడా తగిలాయి కానీ పాట పూర్తయ్యాక చూసినప్పుడు ఆ కష్టమంతా మర్చిపోయాను. పాట అద్భుతంగా వచ్చింది. ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి, శ్రీనివాసా చిట్టూరి గారికి కృతజ్ఞతలు’’.. అన్నారు.


మణిశర్మ కంపోజ్ చేసిన ఈ పాటని తెలుగు, హిందీ భాషల్లో హారిక నారాయణ్ పాడారు. తెలుగు పాటని సంపత్ నంది రాయగా హిందీ వెర్షన్ వనిత గుప్తా రాశారు.