Shilpa Shetty : రాజ్‌ కుంద్రా అరెస్టుతో శిల్పాశెట్టికి రూ.2 కోట్ల నష్టం

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. భర్త అరెస్ట్‌ ఎఫెక్ట్‌ శిల్పాశెట్టి కెరీర్‌పై కూడా పడింది. ఈ కేసు వల్ల ఇప్పటికే ఆమె రూ.కోట్లలో నష్టపోతుంది.

Shilpa Shetty

Raj Kundra arrest : బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో నెటిజన్లు శిల్పాశెట్టి ఫ్యామిలీని దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. భర్త అరెస్ట్‌ ఎఫెక్ట్‌ శిల్పాశెట్టి కెరీర్‌పై కూడా పడింది. ఈ కేసు వల్ల ఇప్పటికే ఆమె రూ.కోట్లలో నష్టపోతుంది.

రాజ్‌కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి శిల్పాశెట్టి ఇంటి నుంచి బయటకు రావడం లేరు. అంతేకాకుండా ఆమె పాల్గొనాల్సిన పలు షోల షూటింగ్స్‌ని కూడా రద్దు చేసుకున్నారు. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ డ్యాన్స్‌ షోకి శిల్పాశెట్టి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షో ఒక్కో ఎపిసోడ్‌కి ఆమెకు రూ.18 నుంచి రూ.22 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. అయితే భర్త అరెస్ట్‌ అయినప్పటి నుంచి ఆమె ఈ షో షూటింగ్‌కి వెళ్లడం లేదు. దీంతో ఇప్పటి వరకు శిల్పాశెట్టి దాదాపు రూ.2 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది.

మరోవైపు డ్యాన్స్‌ షో షూటింగ్‌కి శిల్పాశెట్టి డుమ్మా కొట్టడంతో నిర్వాహకులు ఆమె స్థానంలో ఒక ఎపిసోడ్‌కి కరిష్మా కపూర్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లను తీసుకొచ్చారు. అయితే వీరంతా ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి వెళ్లిపోయారు. ఇలా గెస్ట్‌లతో ఈ షోని ఎక్కువ రోజులు నడిపించలేరు.

ప్రస్తుతం రాజ్‌కుంద్రా కేసు విచారణలో ఉంది. ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. సాక్ష్యాలన్నీ వ్యతిరేకంగా ఉండడంతో అతను జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ డ్యాన్స్‌ షోలో శిల్పాశెట్టిని ఉంచాలా? వద్దా? అనే విషయంపై నిర్వాహకులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.