Ranveer Singh: ధురంధర్ నటుడిపై నిషేధం.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్.. ‘డాన్ 3’ వివాదంలో సంచలన నిర్ణయం
ధురంధర్ మూవీ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh)పై బాలీవుడ్ నిషేధం.
- V Santhosh Kumar
- Published on- May 25, 2026 / 08:31 PM IST
Bollywood Ban on Dhurandhar Hero Ranveer Singh
- ‘డాన్ 3’ వివాదంలో రణ్‌వీర్ సింగ్‌పై నిషేధం
- రూ.40 కోట్ల నష్టంతో నిర్మాతల ఆగ్రహం
- రణవీర్ పై ఫెడరేషన్ సీరియస్ యాక్షన్
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు ఊహించని షాక్ తగిలింది. క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ నుండి అకస్మాత్తుగా తప్పుకున్నాడనే కారణంతో ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) ఆయనపై నిషేధం విధించింది. ఇండస్ట్రీకి చెందిన ఎవరూ ఆయనకు సహకరించకూడదంటూ ‘నాన్-కోఆపరేషన్’ ఆదేశాలు జారీ చేసింది. షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందే రణ్‌వీర్ తప్పుకోవడంతో, ప్రీ-ప్రొడక్షన్ రూపంలో తమకు రూ.40 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ ఆరోపించారు.
Kajal Aggarwal: పువ్వుల మధ్యలో మల్లె తీగలా.. కాజల్ అగర్వాల్ అందచందాలు.. ఫొటోలు
స్క్రిప్ట్ విభేదాల వల్లే రణ్‌వీర్(Ranveer Singh) తప్పుకున్నట్లు ప్రచారం జరగగా, దీనిపై వివరణ ఇవ్వాలని FWICE మూడుసార్లు నోటీసులు పంపినా ఆయన స్పందించలేదు. దీంతో ఏ విభాగానికి చెందిన కార్మికులు, టెక్నీషియన్లు రణ్‌వీర్‌తో కలిసి పనిచేయకూడదని ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రణ్‌వీర్ నటిస్తున్న ఇతర సినిమాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్‌ల కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘డాన్’ ఫ్రాంచైజీలో ఇప్పుడు హీరో ఎవరనే సందిగ్ధత నెలకొంది. రణ్‌వీర్ స్థానంలో హృతిక్ రోషన్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చినా, ఆయన టీమ్ వాటిని ఖండించింది. ప్రస్తుతం ఈ నిషేధ ఉదంతం బాలీవుడ్‌లో చిలికి చిలికి గాలివానగా మారి తీవ్ర సంచలనం రేపుతోంది.
