Kangana Ranaut: బీజేపీలో చేరనున్న బాలీవుడ్ బ్యూటీ కంగనా..
కంగనా రనౌత్.. బాలీవుడ్ లో ఈ అమ్మడు ఒక సంచలనం. తన అద్భుతమైన నటనతో బి-టౌన్ లో లేడీ సూపర్ స్టార్ ఎదిగి, జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డలున అందుకుంది. అంతేకాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ సినీ, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
- gum 95921
- Published On : October 30, 2022 / 07:30 AM IST
Bollywood beauty Kangana to join BJP
Kangana Ranaut: కంగనా రనౌత్.. బాలీవుడ్ లో ఈ అమ్మడు ఒక సంచలనం. తన అద్భుతమైన నటనతో బి-టౌన్ లో లేడీ సూపర్ స్టార్ ఎదిగి, జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డలున అందుకుంది. అంతేకాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ సినీ, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
గత కొంతకాలంగా పరోక్షంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపేలా మాట్లాడుతూ వస్తున్న కంగనా.. తన మనసులోని మాట బయటపెట్టింది. ఇన్నాళ్లు “రాజ్యకీయంలోకి రాబోతున్నారా?” అన్న ప్రశ్ననని ఖండిస్తూ వచ్చిన కంగనా, తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు వ్యతిరేకం కాదని, భవిషత్తు పొలిటికల్స్ లో తన పాత్ర ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
కంగనా.. “‘నేను ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతాను. ప్రభుత్వం తన భాగస్వామ్యం కోరుకుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను. ప్రజలకి సేవ అవకాశం వస్తుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లోని ‘మండి’ నుంచి పోటీచేస్తా” అంటూ కుండ బద్దలు కొట్టేసింది. కాగా ‘మండి’ కంగనా రనౌత్ సొంత నియోజకవర్గం. మరి సినీరంగంలో క్వీన్ గా ఎదిగిన ఈ బ్యూటీ, రాజకీయాల్లో ఎలాంటి ముద్ర వెయ్యగలదో చూడాలి.
