Kangana Ranaut : ఫిలింఫేర్ అవార్డులపై న్యాయ పోరాటం చేస్తాను.. నేను వద్దన్నా నన్ను ఎందుకు నామినేట్ చేశారు..

ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల నామినేషన్స్ లో కంగనా నటించిన తలైవి సినిమా కూడా ఉంది. దీంతో కంగనా స్పందిస్తూ.. ''అవార్డులు ఇవ్వడంలో నిజాయితీ, కనీస విలువలు పాటించని ఇలాంటి అవార్డులకు నేను ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నాను. ఈ అవార్డుని నేను................

Kangana Ranaut : ఫిలింఫేర్ అవార్డులపై న్యాయ పోరాటం చేస్తాను.. నేను వద్దన్నా నన్ను ఎందుకు నామినేట్ చేశారు..

Kangana says she will fight legal battle against Filmfare awards

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఏం మాట్లాడినా సెన్సేషన్ అవ్వాల్సిందే. తనకి నచ్చని ఏ విషయాన్ని అయినా కచ్చితంగా ఖండిస్తోంది. ఇక బాలీవుడ్ మాఫియా దానికి రిలేటెడ్ గా ఉన్న ప్రతి అంశాన్ని విభేదిస్తుంది. తాజాగా ఫిలింఫేర్ అవార్డులపై న్యాయ పోరాటం చేస్తానంటుంది కంగనా. కొన్ని అవార్డులు డబ్బులిస్తే ఇస్తారు, లేదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు, సినీ పరిశ్రమలో పెద్దలు చెప్పిన వాళ్లకి ఇస్తారు అని ఓ టాక్ ఉంది. ఇలాంటి టాక్ ఫిలింఫేర్ అవార్డులపైన కూడా ఉంది. గతంలోనే ఈ అవార్డులపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వ్యతిరేకిస్తూ, తన వరకు ఈ అవార్డును బ్యాన్ చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నానని, ఫిలింఫేర్ అవార్డులు తీసుకోనని ప్రకటించింది.

తాజాగా మరోసారి ఈ వివాదం మళ్ళీ మొదలైంది. ఈ ఏడాది ఫిలింఫేర్ అవార్డుల నామినేషన్స్ లో కంగనా నటించిన తలైవి సినిమా కూడా ఉంది. దీంతో కంగనా స్పందిస్తూ.. ”అవార్డులు ఇవ్వడంలో నిజాయితీ, కనీస విలువలు పాటించని ఇలాంటి అవార్డులకు నేను ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నాను. ఈ అవార్డుని నేను బ్యాన్ చేశాను. ఇది ఆ సంస్థకి కూడా తెలుసు. ఈ సారి మళ్ళీ తలైవి సినిమాని నామినేషన్స్ లో ఉంచి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ అవార్డు నాకు రాదు, వాళ్ళు ఇద్దామనుకున్న వాళ్లకి ఇస్తారు, అలాంటప్పుడు నామినేషన్స్ కూడా అనవసరం. అయినా నేను వద్దంటున్నా ఈ అవార్డులకు నన్ను ఎందుకు నామినేట్‌ చేశారు. ఇష్టంలేని అవార్డ్‌ ఇచ్చి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ సంస్థ ధోరణిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను” అని తెలిపింది.

Chitrapuri Colony Hospital : సినీ కార్మికుల కోసం చిరంజీవి హాస్పిటల్.. ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన దివంగత ప్రముఖ నటుడి కూతుర్లు

కంగనా చేసిన ఈ వ్యాఖ్యలని ఫిలింఫేర్ నిర్వాహకులు సీరియస్ గా తీసుకొని.. ”అవార్డులని అందించడంలో ఫిలింఫేర్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. మా అవార్డుల కార్యక్రమానికి రాకున్నా, ఏ పర్‌ఫార్మెన్స్‌ చేయకున్నా కంగనాకు గతంలో మా అవార్డుని ఇచ్చాము. ఇదే మా సంస్థ నిజాయితీకి నిదర్శనం. తాను చేసిన వ్యాఖ్యలకి గాను ఇప్పుడు ‘తలైవీ’ నామినేషన్‌ వెనక్కి తీసుకుంటున్నాం. మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే మేము కూడా కోర్టును ఆశ్రయిస్తాం” అని ప్రకటించారు.