Chitrapuri Colony Hospital : సినీ కార్మికుల కోసం చిరంజీవి హాస్పిటల్.. ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన దివంగత ప్రముఖ నటుడి కూతుర్లు

ప్రభాకర్ రెడ్డి కూతుర్లు మాట్లాడుతూ.. ''చిత్రపురి కాలనీలో డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేయాలని చూస్తున్నారు. మద్రాస్‌ నుంచి చిత్రపరిశ్రమ హైదరాబాద్ వచ్చినప్పుడు 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారికోసం అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి.............

Chitrapuri Colony Hospital : సినీ కార్మికుల కోసం చిరంజీవి హాస్పిటల్.. ప్రెస్ మీట్ పెట్టి విమర్శించిన దివంగత ప్రముఖ నటుడి కూతుర్లు

Actor Prabhakara reddy daughters oppose chiranjeevi decision on chitrpuri colony hospital

 

Chitrapuri Colony Hospital :  మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారన్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో సినిమా వాళ్ళు ఉండే చిత్రపురి కాలనిలో ఓ హాస్పిటల్ కట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి చిరంజీవి కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. అయితే ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి చిత్రపురి కాలనిలో ఒక సంవత్సరం లోపే తానె స్వయంగా సినీ కార్మికుల కోసం హాస్పిటల్ కడతాను. మొత్తం ఖర్చంతా నేనే భరించి నా తండ్రి పేరు మీద హాస్పిటల్ కట్టి తక్కువ ధరలకే వైద్యం అందేలా చేస్తాను. ఇందుకు ఎవరైనా విరాళాలు ఇచ్చి భాగస్వామ్యం అవుతానన్నా సపోర్ట్ చేస్తాను అంటూ ప్రకటించారు. ఈ నిర్ణయంపై టాలీవుడ్ అంతా హర్షం వ్యక్తం చేసింది.

తాజాగా చిరంజీవి చేసిన ఈ ప్రకటనపై ఓ దివంగత ప్రముఖ నటుడి కూతుర్లు విమర్శలు చేశారు. పాత సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన డాక్టర్ కం యాక్టర్ ప్రభాకర్ రెడ్డి నలుగురు కూతుర్లు ఈ విషయంపై సోమవారం ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిరంజీవి పేరు ప్రస్తావించకుండా ప్రముఖ వ్యక్తి అంటూ విమర్శలు చేశారు.

Dhanush – Aishwarya : విడాకుల తర్వాత పిల్ల కోసం మొదటిసారి కలిసిన ధనుష్ – ఐశ్వర్య.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

ఈ సమావేశంలో ప్రభాకర్ రెడ్డి కూతుర్లు మాట్లాడుతూ.. ”చిత్రపురి కాలనీలో డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేయాలని చూస్తున్నారు. మద్రాస్‌ నుంచి చిత్రపరిశ్రమ హైదరాబాద్ వచ్చినప్పుడు 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారికోసం అప్పటి ముఖ్యమంత్రులతో మాట్లాడి మా నాన్న డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తే ఇప్పటి పెద్దలు అసలు ప్రభాకర్‌ రెడ్డి చిత్రపురి కాలనీ అని చెప్పరు, కేవలం చిత్రపురి కాలనీ అనే చెప్పడం బాధాకరం.”

”చిత్రపురి కాలనీలో మా నాన్న డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా హాస్పిటల్ కడతామని చిత్రపురి కమిటీకి 2 సంవత్సరాల క్రితమే మేము నివేదిక పంపాము. మేము ఆసుపత్రి ఏర్పాటు, అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తుండగానే ఇప్పుడు ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తన తండ్రి పేరుతో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం తప్పు. ఇదంతా డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి పేరును పూర్తిగా తొలగించే కుట్రలో భాగమే. పేద కళాకారుల కోసం ఆసుపత్రి నిర్మించడాన్ని మేము వ్యతిరేకిండంలేదు. కానీ రెండు సంవత్సరాల క్రితమే మేము హాస్పిటల్ కి పర్మిషన్ అప్లై చేశాము, కరోనా వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది ఇంతలోనే మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన తండ్రి పేరుతో హాస్పిటల్ నిర్మిస్తాను అని ఓ సినీ ప్రముఖుడు ప్రకటించడం కరెక్ట్ కాదు” అని అన్నారు.

ఇలా చిరంజీవి పేరుని ప్రస్తావించకుండానే విమర్శలు చేశారు. మరి దీనిపై చిరంజీవి కానీ, చిత్రపురి కాలనీకి సంబంధించిన పెద్దలు కానీ స్పందిస్తారేమో చూడాలి.