Bollywood : టాలీవుడ్ మీద జెలస్ ఫీల్ అవుతున్న బాలీవుడ్..? పెద్ది విషయంలో..

బాలీవుడ్‌కు టాలీవుడ్ మీద లోపల లోపల జెలసీ పెరుగుతోందన్న టాక్ మొదలైంది. (Bollywood)

  • Published on- June 8, 2026 / 09:10 PM IST

jealousy

Bollywood : టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్‌ను డామినేట్ చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డులు సృష్టిస్తూ టాలీవుడ్‌ సినిమాల రేంజ్‌ అంతకంతకు పెరుగుతోంది. దీంతో బాలీవుడ్‌లో కొంత అసహనం పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. కంటెంట్, విజువల్ స్కేల్ పరంగా టాలీవుడ్ సినిమాలకు క్రేజ్ పెరుగుతుండటం, నార్త్ మార్కెట్‌లో కూడా మన సినిమాలకు మంచి ఓపెనింగ్స్ దక్కుతుండటంతో టాలీవుడ్‌ వర్సెస్ బాలీవుడ్ కంపారిజన్ పెరిగిపోతోందట.

అందుకే బాలీవుడ్‌కు టాలీవుడ్ మీద లోపల లోపల జెలసీ పెరుగుతోందన్న టాక్ మొదలైంది. మన దగ్గర చిన్న సినిమా హిట్ అయినా, ఏ భాష సినిమా అయినా ముఖ్యంగా బాలీవుడ్ మూవీ సక్సెస్ అయితే మన తెలుగు హీరోలు, డైరెక్టర్లు ఓపెన్‌గా సోషల్ మీడియాలో అభినందిస్తుంటారు. ఇది మన ఇండస్ట్రీ కల్చర్‌కి ఒక పెద్ద ప్లస్. కానీ మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాలు సాధించినా, పెద్ది లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చినా, బాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు రాకపోవడం చర్చకు దారితీస్తోంది. బాలీవుడ్‌ స్టార్స్‌ బిజీగా ఉండి రియాక్ట్ కాలేదని అనుకోవడానికి లేదని, ఒకరకంగా సైలెంట్ కాంపిటేషన్ అని టాక్ నడుస్తోంది.

Also Read : Mahendragiri Varahi : ‘మహేంద్రగిరి వారాహి’ టీజర్ వచ్చేసింది.. సుమంత్ కొత్త సినిమా.. డివోషనల్ థ్రిల్లర్..

గతంలో ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్ లో నెగిటివిటి చేసిన సంగతి తెలిసిందే. సలార్ సినిమాకు షారుఖ్ సినిమా ఉందని థియేటర్స్ ఇవ్వకుండా బాలీవుడ్ లో ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్ది సినిమా బాగున్నా, చరణ్ పర్ఫార్మెన్స్ ని అందరూ పొగుడుతున్నా, బాలీవుడ్ భామ జాన్వీ ఉన్నా అసలు బాలీవుడ్ స్టార్స్, మీడియా కూడా పెద్ది సినిమా గురించి పాజిటివ్ గా చెప్పట్లేదు. పైగా జాన్వీ పాత్రని అడ్డం పెట్టుకొని పెద్ది సినిమాపై విషం కక్కుతున్నారు.

కొందరు మాత్రం ఇది పూర్తిగా జెలసీ కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఉండే న్యాచురల్ బిహేవియర్ అని చెబుతున్నారు. కానీ బాలీవుడ్ సినిమాలు సక్సెస్ అయితే టాలీవుడ్‌ హీరోలు పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నప్పుడు బాలీవుడ్‌ ప్రముఖులు ఎందుకు జెలసీగా ఫీల్ అవుతున్నారన్నదే చర్చగా మారింది. మన వాళ్లు వాళ్లను ఎంకరేజ్ చేస్తారు. కానీ వాళ్లు మాత్రం మన సినిమా సక్సెస్ అయితే డైజెస్ట్ చేసుకోరన్న భావన బలపడుతోంది. ఇదంతా నిజమా, లేక కేవలం ఓవర్ అనాలిసిస్ మాత్రమేనా అనేది పక్కన పెడితే, టాలీవుడ్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతోందనేది మాత్రం క్లియర్ కట్‌ క్లారిటీ. అందుకే బాలీవుడ్‌లో జెలసీ అనే టాక్ కామన్ అనే ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి.

Also Read : Vanda Devullu : ‘వంద దేవుళ్లు’ ట్రైలర్ రిలీజ్.. బిచ్చగాడు కాంబో.. మరోసారి అమ్మ ఎమోషన్..