ఈ బాలీవుడ్ భామల సూపర్ లగ్జరీ కార్లు చూశారా? ఇందులోనే సిటీని చుట్టేస్తుంటారు!

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 10:02 AM IST
ఈ బాలీవుడ్ భామల సూపర్ లగ్జరీ కార్లు చూశారా? ఇందులోనే సిటీని చుట్టేస్తుంటారు!

Updated On : April 27, 2020 / 10:02 AM IST

బాలీవుడ్ భామల గ్లామర్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారి లైఫ్ ఎంత రాయల్ ఉంటుందో అదే స్థాయిలో వారి అలవాట్లు, ఇష్టాలు ఉంటాయి. తమ పాపులారిటీకి తగినట్టుగా హుందాగా కనిపిస్తుంటారు. అభిమానుల విషయానికి వస్తే.. అభిమాన తారల మూవీలను ఎంతగా ఇష్టపడతారో వారి వ్యక్తిగత జీవితంపై కూడా అంతే ఆసక్తిని చూపిస్తుంటారు. సెలబ్రెటీలకు సంబంధించిన తెర బయటి విషయాలను తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు.

బాలీవుడ్ సెలబ్రెటీల్లో చాలామందికి కార్లపై మోజు ఎక్కువనే చెప్పాలి. లగ్జరీ కార్లు కంటే అమితంగా ఇష్టపడతారు. అందుకే మార్కెట్లో కొత్త లగ్జరీ కారు వస్తే చాలు.. వెంటనే కొనేసి తమ ముచ్చట తీర్చుకుంటుంటారు. అదే కారులో సిటీ అంతా చక్కర్లు కొడుతుంటారు. ఈమెంట్లు, షోలకు అ లగ్జరీ కార్లలో వెళ్తుంటారు. బాలీవుడ్ సెలబ్రెటీల్లో చాలామంది హీరోయిన్లు లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు. వారిలో మాధురి దీక్షిత్, జుహి చావ్లా, రవీణా టండాన్, కాజోల్ సహా ఇతరులు ఉన్నారు. లగ్జరీ కార్లను కలిగి ఉన్న బాలీవుడ్ భామల జాబితాను మీ కోసం అందిస్తున్నాం.. ఇందులో మీ అభిమాన హీరోయిన్ ఉన్నారేమో ఓసారి లుక్కేయండి..

 

జుహి చావ్లా :
బాలీవుడ్ సెలబ్రెటీల్లో అందమైన తారల్లో జుహి చావ్లా ఒకరు. 1988లో అమిర్ ఖాన్ నటించిన Qayamat Se Qayamat Tak మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈ మూవీలో అమిర్‌కు అపోజిట్ రోల్ చేసింది. 1984లో భారత మిస్ ఇండియా విజేతగా నిలిచి పాపులర్ అయింది.

అదే పాపులారిటీతో తనదైన నటనతో మూవీల్లో రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. బాలీవుడ్‌లో బెస్ట్ యాక్టరస్ గా పేరొందిన జుహీ చావ్లాకు లగ్జరీ కార్లు అంటే పిచ్చి. Porsche Cayenne లగ్జరీ కారులోనే ఎప్పుడూ ట్రావెల్ చేస్తుంటుంది. అంతేకాదు.. లగ్జరీ కారు అయిన Jaguar XJL కారులో ఈవెంట్లు, షోలకు వెళ్తుంటుంది.

రవీనా టాండన్ :
బాలీవుడ్ 90వ సంవత్సరంలో రవీనా టాండన్ పాపులర్ సెలబ్రెటీ.. గోవిందా, అక్షయ్ కుమార్ లతో కలిసి చాలా మూవీల్లో నటించింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన Patthar Ke Phool మూవీతో సినీ రంగప్రవేశం చేసింది.

మోహ్రా, దిల్ వాలే, లాడ్లా, కిలాడియోన్, కా ఖిలాడీ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీల్లో నటించింది. రవీనా టాండన్ కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. ఎక్కడి ఈవెంట్లకు వెళ్లినా ఆమె Mercedes-Benz GLS 350, JAGUAR XJ కార్లలోనే కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ప్రయాణ సమయాల్లో Audi Q7 SUV లగ్జరీ కారులో వెళ్తుంటుంది.

కరీష్మా కపూర్ : 
కరీనా కపూర్ ఖాన్ సోదరిగా కరీష్మా కపూర్ బాలీవుడ్ తారల్లో ఒకరు. 1990, 2000కు ముందు సంవత్సరాల్లో కరీష్మా కపూర్ నటితో ఎన్నో మూవీలతో పాపులరిటీ సాధించింది. హిందీలో వచ్చిన Prem Qaidi మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Raja Hindustani రొమాంటిక్ మూవీతో కరీష్మా కెరీర్ మలుపు తిరిగింది. దీనికి ఎన్నో అవార్డులను గెలుచుకుంది.

నేషనల్ ఫిల్మ్ అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది. కపూర్ కుటుంబంలో లగ్జరీ కార్లకు ప్రత్యేకత ఉంటుంది. కరీష్మా ఎప్పుడూ vogue luxury కార్లలో ట్రావెల్ చేసేందుకు ఇష్టపడుతుంది. Land Rover Freelander 2 SUV కార్లను ఎక్కువగా ప్రయాణాల్లో వాడుతుంటుంది.

శిల్పా శెట్టీ :
బాలీవుడ్ సెలబ్రెటీ, టెలివిజన్ యాక్టర్ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. భారత సినిమాలో ఆమె ఎన్నో మూవీల్లో నటించి ప్రేక్షకుల ఆధారణ పొందింది. హిందీలో Celebrity Big Brother 5 సీజన్ విజేతగా కూడా గెలిచింది.  Main Khiladi Tu Anari, Hathkadi, Dhadkan వంటి ఎన్నో మూవీల్లో తన నటనతో ఆకట్టుకుంది.

తన వ్యక్తిగత జీవితానికి వస్తే.. లగ్జరీ కార్లలో ప్రయాణించడమంటే ఎంతో ఇష్టం కూడా.. సిటీలో ఎక్కడైనా ఈవెంట్లు, షోలకు వెళ్లినప్పుడు ఎక్కువగా BMW i8, BMW 7 Series, Bentley Flying Spur and Range Rover Sport కార్లలో కనిపిస్తుంటుంది.

కాజోల్ : 
1990లో హిందీ సినిమాలో పాపులర్ హీరోయిన్లలో కాజోల్ ఒకరు. Dilwale Dulhania Le Jayenge, Kuch Kuch Hota Hai, Kabhi Khushi Kabhie Gham, Fana, My Name Is Khan వంటి పలు బ్లాక్ బస్టర్ మూవీల్లో తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు.. పద్మశ్రీ, వివిధ ఫిల్మ్ వేర్ అవార్డులను గెల్చుకుంది.

1993లో వచ్చిన Baazigar మూవీతో కమర్షియల్ హిట్ కొట్టింది. 1999లో నటుడు అజయ్ దేవగన్ ను వివాహం చేసుకుంది. రియల్ లైఫ్ లో లగ్జరీ కార్లంటే ఈ భామకు ఎంతో ఇష్టం.. ఎప్పుడు ఏ ఈవెంట్లకు వెళ్లినా తన లగ్జరీ luxurious Volvo XC 90 కారులోనే మెరుస్తుంటుంది.

మాధురి దీక్షిత్ :
1980 తర్వాత 2000కు ముందు ఏళ్లలో బాలీవుడ్ సెలబ్రెటీల్లో మాధురి దీక్షిత్ ఎంతో పాపులర్ హీరోయిన్.  Ilaaka, Tridev, Khalnayak, Kishen Kanhaiya, Saajan, Raja, Dil, Beta వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీల్లో నటించింది. ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, పద్మశ్రీ అవార్డులను కూడా మాధురికి లభించాయి.

తన రియల్ లైఫ్ విషయానికి వస్తే.. లగ్జరీ కార్లలో ప్రయాణమంటే ఆమెకు ఎంతో ఇష్టం.. ఎప్పుడు ఏదైనా ఈవెంట్లకు వెళ్లినా Mercedes Maybach S 560 కారులోనే వెళ్తుంటుంది. DC డిజైన్‌తో వచ్చిన కస్టమ్ డిజైన్డ్ టయోటా ఇన్నోవా క్రిస్టా MPV కారును ఇటీవలే మాధురి దీక్షిత్ కొనుగోలు చేసింది.

Popular Actresses

Bollywood Actress

Madhuri Dixit

Juhi Chawla

Raveena Tandon

Kajol