Bollywood : అనంత్ అంబానీ పెళ్లితో.. బోసిపోతున్న బాలీవుడ్..

హిందీ సినిమా ఇండస్ట్రీ అంతా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ కొడుకు పెళ్లి సెలబ్రేషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.

Bollywood Shooting Shut Down Due to Anant Ambani Radhika Wedding Celebrations

Bollywood : ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం నిన్న గ్రాండ్ గా జరిగింది. కానీ వివాహ వేడుకలు మాత్రం రెండు నెలల నుంచి చేస్తూనే ఉన్నారు. తాజాగా అయిదు రోజుల పెళ్లి అన్నట్టు గత మూడు రోజులుగా ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే అంబానీ ఇంట్లో ఏ వేడుక అయిన ముందుగా బాలీవుడ్ వాళ్లకు పిలుపు వెళ్తుంది. బాలీవుడ్ స్టార్స్ అంతా అంబానీ ఇంటి వేడుకల్లో పాల్గొని సందడి చేస్తారు.

ఇప్పుడు అనంత్ పెళ్లి వేడుకలు అయిదు రోజులు జరుగుతుండటంతో ఈ అయిదు రోజులు బాలీవుడ్ స్టార్స్, టెక్నిషియన్స్ అంతా ఈ పెళ్లిలోనే ఉన్నారు. అంబానీ ఇంట పెళ్లి దెబ్బకి స్టార్ హీరోలెవరూ షూటంగ్స్ కి అటెండ్ అవ్వడం లేదు, టాప్ హీరోయిన్లెవరూ వర్క్ మూడ్ లోనే లేరు. అసలు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎవరి ఇళ్లల్లో వాళ్లు లేనేలేరు. ఎక్కడెక్కడి హీరోలు, హీరోయిన్లు ,సెలబ్రిటీలు అందరూ ఒకే చోట ఫుల్ గా సెలబ్రేషన్ మూడ్ లో మునిగిపోయిన్నారు.

Also Read : Director Shankar : డైరెక్టర్ శంకర్‌కి ఏమైంది? శంకర్ సినిమాల్లో మ్యాజిక్ మిస్ అవ్వడానికి కారణాలేంటి?

కొన్నిరోజులనుంచి బాలీవుడ్ లో ఒకటేసందడి. హీరో హీరోయిన్లంతా ఓన్లీ రెడీ అవ్వడం, డాన్స్ చెయ్యడం, చిల్ అవ్వడం. హిందీ సినిమా ఇండస్ట్రీ అంతా ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ కొడుకు పెళ్లి సెలబ్రేషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్లూ వీళ్లూ అని తేడా లేకుండా తారాలోకం అంతా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో సందడి చేస్తున్నారు.

అనంత్ వెడ్డింగ్ లో జులై 11 సంగీత్, ఆ ముందు రోజు హల్దీ, మెహందీ, 12న శుక్రవారం నాడు వివాహం అవ్వగా నేడు 13న శుబ్ ఆశీర్వాద్, రేపు 14న శుభ్ మంగళ్ ఈవెంట్స్ లో సెలబ్రిటీలందరూ హడావిడి చేస్తున్నారు. పెళ్ళిలో డ్యాన్సులు వేస్తూ సందడి చేస్తున్నారు. మన టాలీవుడ్ నుంచి కూడా రామ్ చరణ్, ఉపాసన, మహేష్ ఫ్యామిలీ, అఖిల్, వెంకటేష్.. ఇలా పలువురు అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. బాలీవుడ్ నటీనటులు, స్టార్ సాంకేతిక సిబ్బంది అంతా అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకల్లో ఎంజాయ్ చేస్తుంటే ఇంక షూటింగ్స్ ఏం చేస్తారు. అందుకే గత వారం రోజులుగా బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ షూటింగ్స్ జరగక బాలీవుడ్ బోసిపోయింది.

ట్రెండింగ్ వార్తలు