Allu Arjun: నేను మీ సినిమాలో చేస్తాను.. అల్లు అర్జున్ కు బాలీవుడ్ స్టార్ రిక్వెస్ట్.. ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్
బాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తో కలిసి నటించాలని అనుకుంటున్నాడట.
- V Santhosh Kumar
- Published On : March 16, 2026 / 10:26 AM IST
Bollywood star John Abraham wants to act in Allu Arjun movie
Allu Arjun: పుష్ప 2 తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ టాలీవుడ్, బాలీవుడ్ హద్దులు దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరుకుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కనివిని ఎరుగని విధ్వంసం సృష్టించడమే కాకుండా, ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు అల్లు అర్జున్. ఇప్పుడు అగ్ర దర్శకులందరూ బన్నీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. కేవలం మాస్ సినిమాలు మాత్రమే కాకుండా, ప్రయోగాత్మక చిత్రాలతో గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఆయన తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు.
Sai Pallavi: తెరపైకి మరో క్రేజీ బయోపిక్.. హీరోయిన్ గా సాయి పల్లవి.. ఇంతకీ డైరెక్టర్ ఎవరో తెలుసా?
అందుకే, ఆయన చేస్తున్న తర్వాతి సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఆయన లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అట్లీ దర్శకత్వంలో రూపొందే సినిమా హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తన 23వ సినిమాను ప్రారంభించబోతున్నారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈనేపధ్యంలోనే తాజాగా అల్లు అర్జున్(Allu Arjun) గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే, బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం స్వయంగా బన్నీని కలిసి, ఆయనతో కలిసి నటించాలనే తన కోరికను వెల్లడించారట.
ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే, ఈ న్యూస్ కేవలం మాట వరకే కాకుండా, అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ (AA22)లో జాన్ అబ్రహం ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇండియన్ స్క్రీన్‌పై ఇద్దరు బిగ్గెస్ట్ యాక్షన్ హీరోల కొల్లాబరేషన్ ఒక విజువల్ ఫీస్ట్‌లా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ న్యూస్ కేవలం రూమర్స్ వరకే ఉంటుందా లేక నిజంగా జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది.
