Ram Charan: రామ్ చరణ్ – సంజయ్ లీలా భన్సాలీ కాంబో సెట్.. హిస్టారికల్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో భారీ మూవీ
సుకుమార్ తరువాత బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో సినిమా ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్(Ram Charan).
- V Santhosh Kumar
- Published on- April 11, 2026 / 09:14 PM IST
bollywood star sanjay leela bhansali planning a movie with ram charan
- సుకుమార్ తరువాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్
- సంజయ్ లీలా భన్సాలీతో పీరియాడికల్ డ్రామా
- త్వరలోనే అధికారిక ప్రకటన
Ram Charan: టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు ఇతర భాషల దర్శకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హిందీ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న చరణ్(Ram Charan), ఆ తర్వాత సుకుమార్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్ ఒక భారీ పీరియడ్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నారనే వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో రావాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయినప్పటికీ, ఈసారి పక్కాగా సినిమా ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Allu Arjun- Prashanth neel: ప్రశాంత్ నీల్ లిస్ట్ నుంచి అల్లు అర్జున్ అవుట్.. అసలు ఏమైంది అంటే?
మరోవైపు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా భన్సాలీని పలుమార్లు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బన్నీ తన తదుపరి చిత్రాలైన ‘రాకా’, లోకేష్ కనగరాజ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, భన్సాలీ ఆఫీసులో ఆయన కనిపించడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ లతో ‘లవ్ అండ్ వార్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 ఆగస్టులో విడుదల కానుంది. ఇది పూర్తయిన తర్వాతే తెలుగు స్టార్ హీరోతో భన్సాలీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఈ క్రేజీ కాంబినేషన్ల వెనుక ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథలు ఉన్నాయన్న టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒకవేళ రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్లలో ఎవరైనా భన్సాలీ దర్శకత్వంలో నటిస్తే, అది భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయం. చరణ్ గతంలో బాలీవుడ్ లో చేసిన ‘జంజీర్’తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఈసారి భన్సాలీ లాంటి మేకర్ తో స్ట్రెయిట్ హిందీ మూవీ చేస్తే రికార్డులు తిరగరాయడం తథ్యమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానుల నిరీక్షణ తప్పేలా లేదు.
