Bollywood Talk Show Koffee with Karan Season 8 will Starts Soon
Koffee with Karan : బాలీవుడ్(Bollywood) హిట్ షో కాఫీ విత్ కరణ్ కొన్ని రోజుల క్రితం ఏడో సీజన్ ముగించుకోగా తాజాగా 8వ సీజన్ మొదలవ్వనుంది. 7వ సీజన్ లో సౌత్ స్టార్స్ కూడా వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. సినిమాల గురించి, పర్సనల్ విషయాల గురించే కాక కరణ్ జోహార్(Karan Johar) పిచ్చి పిచ్చి ప్రశ్నలు కూడా వేస్తుంటాడు. షోకి వచ్చే గెస్టులు కొంతమంది కరణ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడితే కొంతమంది కరణ్ కి కౌంటర్లు ఇస్తారు.
Also Read : Prithviraj Sukumaran : సలార్ డైలాగ్ లీక్ చేసిన పృథ్విరాజ్ సుకుమారన్.. మాములుగా లేదుగా డైలాగ్..
ఇక సీజన్ 8 అక్టోబర్ 26 నుంచి మొదలవ్వనుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో కాఫీ విత్ కరణ్ షో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా మొదటి ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్ కి రణవీర్ సింగ్, దీపిక పదుకొనే వచ్చి సందడి చేశారు. ఈ ఇద్దరూ ఫుల్ యాక్టివ్ గా, సరదాగా, రొమాంటిక్ గా ఉన్నారు. దీంతో కాఫీ విత్ కరణ్ మొదటి ఎపిసోడ్ అదిరిపోతుందని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో కరణ్ ఇంకా ఎవరెవర్ని తీసుకొస్తారో చూడాలి.