Maldives: మాల్దీవుల్లో ఆ సరదాలకు బ్రేక్..

భారత్‌ నుంచి పర్యాటకుల రాకపోకలపై టెంపరరీ బ్యాన్ విధిస్తూ అక్కడి టూరిజం డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది....

Bollywood Trolled After Maldives Bans Indian Tourists

Maldives: కాస్త గ్యాప్ దొరికితే చాలు సినిమా సెలబ్రిటీలు వెంటనే మాల్దీవుల బాట పడుతుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్ల వల్ల మాల్దీవులు మరో ముంబైలా మారింది. చాలామంది బర్త్‌డే, మ్యారేజ్‌డే.. ఇలా విశేషమేదైనా మాల్దీవుల్లో సెలబ్రేట్‌ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక హీరోయిన్లతే అక్కడ హాట్‌హాట్‌ ఫొటోషూట్‌లు చేసి.. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని మురిసిపోతున్నారు.

అలాంటి వారందరికీ ఇది నిజంగా చేదువార్త. భారత్‌ నుంచి పర్యాటకుల రాకపోకలపై టెంపరరీ బ్యాన్ విధిస్తూ అక్కడి టూరిజం డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 27 నుంచి ఈ నిషేదం అమలులోకి రానుంది. బాలీవుడ్‌ తారలపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది.

ఇప్పుడు సెలబ్రెటీలంతా సోషల్‌ మీడియాలో ఏ ఫొటోలు పంచుకోవాలి.. ఏ పోస్టులు చేయాలంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు. అనవసరంగా టికెట్లు బుక్‌ చేశానంటూ బాధపడుతున్నట్లుగా మీమ్స్‌ కూడా తెగ సందడి చేస్తున్నాయి.