లక్ష్మీస్ ఎన్టీఆర్-బొమ్మాళీ రవిశంకర్ సాంగ్ వైరల్

 లక్ష్మీ'S ఎన్టీఆర్‌లో పాట పాడుతున్నబొమ్మాళీ రవిశంకర్..

  • Publish Date - February 11, 2019 / 09:47 AM IST

 లక్ష్మీ’S ఎన్టీఆర్‌లో పాట పాడుతున్నబొమ్మాళీ రవిశంకర్..

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ.. లక్ష్మీ’S ఎన్టీఆర్.. అసలు కథ.. ఈ సినిమా నుండి, వెన్నుపోటు, ఎందుకు అనే రెండు పాటలు, షూటింగ్‌కి సంబంధించిన అప్‌డేట్స్, ఆర్టిస్ట్‌ల ఫోటోలతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ లేపుతున్నాడు వర్మ. లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్ జీవితాన్ని చూపించబోతున్నానని, వెన్నుపోటు అంశం హైలెట్ అవుతుందని వర్మ చెప్పడంతో, కొందరు టీడీపీ కార్యకర్తలు ఆయనపై కేసులు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా తన సినిమాపై కక్ష గడుతున్న వాళ్ళందరికీ, ఒకే ఒక్క పిక్‌తో, తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చిన వర్మ, ఇప్పుడు ఒక సాంగ్ వీడియో పోస్ట్ చేసాడు.

వదల బొమ్మాళీ.. వదలా.. అంటూ తన గంభీరమైన గొంతుతో అందరినీ భయపెట్టిన రవిశంకర్‌‌తో,  లక్ష్మీ’S ఎన్టీఆర్‌లో ఒక పాట పాడిస్తున్నాడు.. దోపిడిదారుల పెత్తనమే ఇక వద్దని చిత్తుగ పడగొడదాం.. అనే పాట రవిశంకర్ పాడుతుండగా, లిరిక్స్ రాసిన సిరాశ్రీ, మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న కళ్యాణి మాలిక్ కూడా సాంగ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. నీ వాయిస్‌లో పవర్ ఉంది. పైనున్న ఎన్టీఆర్‌కి కూడా వినబడుతుంది అని ఆర్జీవీ ట్వీట్ చేసాడు. ఫిబ్రవరి 14న లక్ష్మీ’S ఎన్టీఆర్‌ ట్రైలర్ రిలీజ్ కానుంది.