Aamir Khan : నా సినిమాని బాయ్‌కాట్ చేయకండి.. ప్లీజ్..
ఈ సినిమాకి బాయ్‌కాట్ సెగ తగిలింది. 'లాల్ సింగ్ చడ్డా' సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. దీంతో ట్విట్టర్ లో.....
- Saketh U
- Updated on- August 1, 2022 / 07:26 PM IST
Amir Khan
Aamir Khan : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య మెయిన్ లీడ్స్ లో ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమాని తెరకెక్కించారు. హాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘ఫారెస్ట్ గంప్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది ఈ సినిమా. నాగ చైతన్య కూడా నటిస్తుండటంతో తెలుగులో కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపారు. తెలుగులో ఈ సినిమా చిరంజీవి రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
అయితే ఈ సినిమాకి బాయ్‌కాట్ సెగ తగిలింది. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. దీంతో ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా ట్రెండింగ్ లో ఉంది. గతంలో అమీర్ ఖాన్ ఇండియాలో ఉండాలంటే రక్షణ లేదు, ఇక్కడ బతకాలంటే భయం వేస్తుంది అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా అమీర్ ని వ్యతిరేకించారు. ఇప్పుడు మరోసారి అమీర్ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఇక్కడ రక్షణ లేదు అనేవాడివి ఇక్కడ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నావు? పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ వెళ్ళు అని కామెంట్స్ చేస్తూ లాల్ సింగ్ చడ్డాని బాయ్‌కాట్ చేయమని ట్రెండింగ్ చేస్తున్నారు.
Vijay Devarakonda : ముంబైలో మెగాస్టార్‌తో లైగర్ టీం
తాజాగా ఈ బాయ్‌కాట్ నిరసనపై అమీర్ ఖాన్ స్పందించాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ”నా మీద, నా సినిమా మీద వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నందుకు చాలా బాధగా ఉంది. నాకు భారతదేశం అంటే ఇష్టం లేదని కొంతమంది అంటున్నారు. దానికి నాకు చాలా బాధగా ఉంది. నేను నా దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు నేను ఒకటే చెప్తున్నాను మీరు నమ్మేది అబద్దం. నా గురించి ఇలాంటి ప్రచారాలు జరగడం చాలా దురదృష్టకరం. దయచేసి నా సినిమా చూడండి. బాయ్‌కాట్ చేయొద్దు” అని అమీర్ ఖాన్ తన ఆవేదనని వ్యక్తం చేశాడు. ఇక కొంతమంది అమీర్ ఖాన్ కి సపోర్ట్ గా కూడా పోస్ట్ చేస్తున్నారు.
