Brahmanandam : మళ్ళీ తాత అయిన బ్రహ్మానందం..
టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకున్న కామెడియన్ 'బ్రహ్మానందం'. దానికి కచ్చితమైన ఉదాహరణ.. ఇటీవల ఎన్టీఆర్ నటించిన బాద్‌షా రీ రిలీజ్ సమయంలో, అభిమానులు బ్రహ్మి ఎంట్రీకి థియేటర్ లో చేసిన సందడి చూసే ఉంటారు. అయితే ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు మళ్ళీ తాత అయ్యాడట.
- gum 95921
- Updated on- November 27, 2022 / 04:37 PM IST
Brahmanandam blessed with another grand child
Brahmanandam : టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ని సంపాదించుకున్న కామెడియన్ ‘బ్రహ్మానందం’. దానికి కచ్చితమైన ఉదాహరణ.. ఇటీవల ఎన్టీఆర్ నటించిన బాద్‌షా రీ రిలీజ్ సమయంలో, అభిమానులు బ్రహ్మి ఎంట్రీకి థియేటర్ లో చేసిన సందడి చూసే ఉంటారు. అయితే ఈ స్టార్ కమెడియన్ ఇప్పుడు మళ్ళీ తాత అయ్యాడట.
Panchathantram Trailer: సాలిడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. గౌతమ్, జ్యోత్స్నాకు గతంలో ‘పార్థ’ అనే ఒక బాబు పుట్టాడు. తాజాగా ఈ జంట మరో పాపకు జన్మనిచ్చారు. తన చెల్లిని ముద్దాడుతున్న పార్ధ ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపినెస్ డబల్ అంటూ కాప్షన్ పెట్టాడు గౌతమ్. కాగా కొంతకాలంగా సినిమాల్లో అంతగా కనిపించని బ్రహ్మానందం, మనవుడు పార్ధతో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను కూడా గౌతమ్ నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటాడు.
ఇక బ్రహ్మానందం నుంచి వస్తున్న ఆంథాలజీ మూవీ ‘పంచతంత్రం’. ఈ సినిమాలో బ్రహ్మి ‘వేదవ్యాస్’ అనే రచయిత పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, స్వాతి రెడ్డి ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని ఇటీవల హీరోయిన్ రష్మిక విడుదల చేసింది. డిసెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
