Panchathantram Trailer: సాలిడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యాంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇలాంటి కోవలోనే వచ్చిన ‘చందమామ కథలు’ వంటి సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు ‘పంచతంత్రం’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Panchathantram Trailer: సాలిడ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ ట్రైలర్

Panchathantram Trailer Impressive With Solid Emotions

Updated On : November 26, 2022 / 8:38 PM IST

Panchathantram Trailer: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యాంథాలజీ మూవీ ‘పంచతంత్రం’ ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఇలాంటి కోవలోనే వచ్చిన ‘చందమామ కథలు’ వంటి సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు ‘పంచతంత్రం’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. అంతేగాక ఈ సినిమాలో బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్రఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు నటిస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

Panchathantram : ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్‌ల ‘పంచతంత్రం’..

ఇక ఈ సినిమాను దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేసింది. ఇక ‘పంచతంత్రం’ ట్రైల‌ర్‌ను మనం గమనించినట్లైతే.. 5 జంట‌ల‌కు సంబంధించిన క‌థగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. డా.బ్ర‌హ్మానందం ఈ ఐదు క‌థ‌ల‌కు పంచేద్రియాలు అనే పేరు పెట్టి త‌న కోణంలో స్టార్ట్ చేస్తార‌ని ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం. మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ముందుకెళ్లామ‌నేది క‌థాంశంగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Naresh Agastya : ‘పంచతంత్రం’ లో విహారిగా నరేష్ అగస్త్య…

ఇక ‘పంచతంత్రం’ సినిమాను ఓ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా, హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో దర్శకుడు తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.