Brahmanandam comments on present education system on R Narayanamurthy new movie title launch
Brahmanandam : స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇటీవల సినిమాలు తగ్గించినా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ సినిమా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా బ్రహ్మానందం.. ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ అనే సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణకి విచ్చేశారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బ్రహ్మానందం ఈ చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరణతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
English Vinglish : శ్రీదేవి మళ్ళీ వస్తుంది.. అతిలోక సుందరి సినిమా చైనాలో రిలీజ్..
ఈ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ ఇప్పటి విద్యావ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఆర్ నారాయణమూర్తి గత 35 సంవత్సరాల అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికి అలానే ఉన్నాడు. స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నో అద్భుత మైన సినిమాలు నిర్మించారు. సినిమానే ప్రాణం ఆయనకి. సినీ పరిశ్రమలో కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు కానీ ప్రజా దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఒక్కడే. చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే ఆ సముద్రం చూసే వ్యక్తి ఆర్ నారాయణ మూర్తి. అయన విద్య బ్యాక్ డ్రాప్ లో ఈ యూనివర్సిటీ సినిమా తీశారు. అప్పటిలోఉన్న చదువు ఇప్పుడు లేదు. గురువులకు అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదు. ఇప్పటి గురు శిష్యుల సంబంధం ఏ బార్ లోనో ఎక్కడో చూడవచ్చు. ఇపుడు చదువు కొనే రోజులొచ్చాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యను వ్యాపారంగా మార్చేసాయి. ఎడ్యుకేషన్ మాఫియా కథాంశంతో నారాయణ మూర్తి ఈ సినిమా తీశారు. ప్రేక్షకులకు, నా అభిమానులకు చెప్తున్నాను.. ఆర్ నారాయణ మూర్తి తీసిన ఈ యూనివర్సిటీ సినిమా అందరూ తప్పకుండా చూడండి. విద్యా వ్యవస్థ లోపాలు తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడండి అని అన్నారు. అలాగే ఇటీవల కొన్ని విద్యాసంస్థలు ర్యాంక్స్, మార్కులు వచ్చాయని విపరీతమైన యాడ్స్ ఇస్తున్నారు. దీనిపై కూడా డైరెక్ట్ గానే కౌంటర్లు వేశారు. దీంతో బ్రహ్మానందం ఇప్పటి విద్యావ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.