Brahmanandam Son Marriage : ఘనంగా బ్రహ్మానందం రెండో తనయుడు సిద్ధార్థ్ వివాహం.. హాజరైన సినీ, రాజకీయ సెలబ్రిటీలు..

సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో ఘనంగా జరిగింది.

Brahmanandam Second Son Siddhartha Marriage happened with Aishwarya

Brahmanandam Son Marriage :  హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. పెద్ద కుమారుడు గౌతమ్ సినిమాల్లో నటిస్తున్నారు. ద్వితీయ కుమారుడు సిద్ధార్థ అమెరికాలో పని చేస్తున్నారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం సిద్ధార్థ నిశ్చితార్థం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ డాక్టర పద్మజ కూతురు డాక్టర్ ఐశ్వర్యతో జరిగింది.

తాజాగా సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు వచ్చారు.

Brahmanandam Second son Wedding : బ్రహ్మానందం రెండో తనయుడి పెళ్లి వేడుకలు.. హాజరైన సెలబ్రిటీలు..

అలాగే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు.. ఇలా అనేకమంది సినీ సెలబ్రిటీలు హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు.