Brahmi-Ali in Chef Mantra Cooking Show
Brahmi-Ali: టాలీవుడ్ స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ.. కామెడీ మాత్రమే కాదు వంటలు కూడా అదరగొట్టేస్తున్నారు. ఎన్నో సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ, ఒక ప్రముఖ వంటల ప్రోగ్రామ్ కలిసి వచ్చి, రుచికరమైన వంటలు చేస్తూ అలరించారు. వంట చిట్కాలతో పాటు, తమ జీవితంలో జరిగిన కొన్ని ఫన్నీ సంఘటలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
Ram Charan: న్యూజిలాండ్ లో ఆడిపాడబోతున్న రామ్‌చరణ్..
ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహలో ప్రసారమవుతున్న “చెఫ్ మంత్ర” ప్రోగ్రామ్ మంచి ప్రజాధారణ పొందింది. ఈ షోకి మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇక రెండో సీజన్ లో ఈ ఇద్దరు స్టార్ కమెడియన్స్ అతిథిలుగా వచ్చి సందడి చేశారు. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోని షో నిర్వాహకులు విడుదల చేశారు.
ఈ ప్రోమోలో బ్రహ్మానందం.. “మా నాన్న చిన్నపుడు సినిమాలు చూస్తే కొట్టేవారని ఎమోషనల్ అయ్యాడు. చివరిలో వండిన వంటలు మంచు లక్ష్మి ఒకటే తినేస్తుంటే.. మనకి పెట్టకుండా ఆవిడే తినేస్తుంది ఏంట్రా అని అలీతో అనడం” అంటూ చాలా సరదాగా సాగిపోయింది ఎపిసోడ్ ప్రోమో.