Evaru Meelo Koteeswarulu : ‘చారి’ కోసం ‘గురువు గారు’..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాట్ సీట్లో కూర్చుని.. ‘కామెడీ కింగ్’ బ్రహ్మానందంను ప్రశ్నలడిగితే ఎలా ఉంటుంది..?
- sekhar
- Published On : September 23, 2021 / 03:33 PM IST
Bramanandam
Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాట్ సీట్లో కూర్చుని.. ‘కామెడీ కింగ్’ బ్రహ్మానందంను ప్రశ్నలడిగితే ఎలా ఉంటుంది.. అదిరిపోతుంది కదూ.. అవును, త్వరలోనే బ్రహ్మానందం, తారక్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో రాబోతున్నారు.
Naga Chaitanya : నెగెటివ్ రోల్‌లో నాగ చైతన్య..!
ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా వచ్చి అలరించారు. ఆ ఎపిసోడ్ హయ్యెస్ట్ టీఆర్‌పీ సాధించింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా వచ్చారు. ఆయన తారక్ షో లో సందడి చేసిన ఎపిసోడ్ దసరా స్పెషల్ గా టెలికాస్ట్ కానుంది. రామ్ చరణ్ లానే మహేష్ కూడా 25 లక్షలు గెలుచుకున్నారు.
Samantha – Chaitanya : ఇద్దరి మధ్య ఏం జరిగింది..?
ఇక ఇప్పుడు బ్రహ్మానందంను గెస్ట్‌గా ఆహ్వానించారని తెలుస్తోంది. ‘అదుర్స్’ సినిమాలో బ్రహ్మి- తారక్ చేసిన కామెడీ అంత త్వరగా మర్చిపోలేం. ‘ఒరేయ్ చారీ’ అంటూ బ్రహ్మానందం.. ‘గురువు గారూ’ అంటూ తారక్ పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. త్వరలో బ్రహ్మానందం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కి విచ్చెయ్యనున్నారు. మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్‌ని కూడా పిలిచారనే మాట వినిపిస్తుంది.
