Dookudu : మహేష్ ‘దూకుడు’ కి పదేళ్లు..

సూపర్ స్టార్ మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అండ్ ఇండస్ట్రీ హిట్ ‘దూకుడు’ పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది..

Dookudu : మహేష్ ‘దూకుడు’ కి పదేళ్లు..

Dookudu

Dookudu: సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా.. శ్రీను వైట్ల దర్శకత్వంలో.. 14 రీల్స్ బ్యానర్ మీద రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అండ్ ఇండస్ట్రీ హిట్ ఫిలిం ‘దూకుడు’.. 2011 సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన ‘దూకుడు’ 2021 సెప్టెంబర్ 23 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.

Anubhavinchu Raja Teaser : బంగారం గాడు ఊర్లోని.. ఆడి పుంజు బరిలోని ఉండగా ఇంకోడు గెలవడం కష్టమెహే..!

ఈ సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #DecadeForIHDookudu హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తూ భారీ స్థాయిలో పోస్టులు చేస్తున్నారు. మూవీ టీం కూడా సోషల్ మీడియా ద్వారా తమ హ్యాపీనెస్‌ని ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. మహేష్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది ‘దూకుడు’.
‘ఖలేజా’ తర్వాత మహేష్‌ ఈ సినిమాలో తనలోని కామెడీ యాంగిల్‌ని కొత్తగా చూపించారు. మహేష్ మేనరిజమ్స్, పంచ్ డైలాగ్స్, ఫైట్స్, డ్యాన్సులతో ప్రేక్షకాభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.

Samantha – Chaitanya : ఇద్దరి మధ్య ఏం జరిగింది..?

‘కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు.. కానీ దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’’.. ‘పోలీస్’.. ‘మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా’.. ‘భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది’.. అంటూ మహేష్ చెప్పిన డైలాగులకు థియేటర్లు దద్దరిల్లాయ్.. సమంత, ప్రకాష్ రాజ్, ప్రగతి, నాజర్, వెన్నెల కిషోర్.. ఇలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తమ క్యారెక్టర్లలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

Dookudu 10 Years

 

తమన్ సంగీతం సినిమాలో హైలెట్‌గా నిలిచింది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశాడు. ‘ నీ దూకుడు.. ఆటో అప్పారావు.. గురువారం మార్చి ఒకటి.. చుల్‌బులి.. దేత్తడి.. అదర అదర’ వంటి సాంగ్స్ ఊపు ఊపాయి.. ‘దూకుడు’ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్, ఖమ్మం వంటి పలు ప్రాంతాల్లో అభిమానులు స్పెషల్ షోలు వేస్తున్నారు.

Mahesh Babu