Breaking: ఎన్నికలకు ముందు విజయ్ కు షాక్.. విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య

(Breaking)తమిళ హీరో విజయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కిన భార్య సంగీత.

Hero Vijay wife Sangeetha moves court seeking divorce.

Breaking; తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ కి ఆయన భార్య సంగీత షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు వచ్చే నెల 20న విచారణకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రముఖ నటితో విజయ్‌కు సంబంధం ఉన్న కారణంగానే సంగీత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే గత రెండేళ్లుగా విజయ్- సంగీత విడిగా ఉంటున్నారట. ఇప్పుడు అధికారికంగా విడాకుల వరకు వెళ్లినట్లు తమిళనాట టాక్ నడుస్తోంది.

Maruthi: మారుతీ కొత్త సినిమా ‘హ్యాపీ పొంగల్’.. హీరో ఎవరో తెలుసా?

ఇక 1999లో వివాహం చేసుకున్న విజయ్- సంగీత జంటకు కుమారుడు జోసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఉన్నారు. దాదాపు 26 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత విజయ్ భార్య సంగీత ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా (Breaking)మారింది. మరోపక్క విజయ్ టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం ఆయన సిద్ధమవుతున్న అవుతున్నాడు. ఈ ఇలాంటి సమయంలో భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూడాలి మరి.