Maruthi: మారుతీ కొత్త సినిమా ‘హ్యాపీ పొంగల్’.. హీరో ఎవరో తెలుసా?
కుర్ర హీరోతో 'హ్యాపీ పొంగల్' అనే సినిమా చేస్తున్న దర్శకుడు మారుతీ(Maruthi).
Director maruthi next movie happy pongal
Maruthi: టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇటీవల దారుణంగా ట్రోల్ అయిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మారుతీ అనే చెప్పాలి. ఈయన దర్శకత్వం వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై భారీ డిజాస్టర్ గా నిలిచింది. రొటీన్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా నార్మల్ ఆడియన్స్ ని కాదు కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కు సైతం నచ్చలేదు. దీంతో, సోషల్ మీడియాలో దర్శకుడు మారుతీపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ప్రభాస్ రేంజ్ హీరో దొరికితే అలాంటి సినిమానా తీసేది అంటూ కామెంట్స్ చేశారు.
దాంతో, మీడియా ముందుకు రావడం మానేశాడు మారుతీ(Maruthi). ఈనేపథ్యంలోనే తన కొత్త సినిమా విషయంలో పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడట. అవును, ది రాజాసాబ్ లాంటి డిజాస్టర్ తరువాత మరోసారి కామెడీ ఎంటర్టైనర్ కథతో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడట మారుతీ. ఇటీవలే ఆ కథను ఒక యంగ్ హీరోకి వినిపించగా వెంటనే ఒకే చెప్పేశాడట. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాకు ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడట మారుతీ.
Kiran Abbavaram: భరత్ కమ్మాతో ‘గువ్వల చెరువు గట్టు’.. ఆసక్తికరంగా కిరణ్ అబ్బవరం కొత్త ప్రాజెక్టు
అయితే, ఈ కథను ఒకే చేసిన హీరో ఎవరి అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ హీరో కూడా ప్రస్తుతం వరుస ప్లాప్స్ తో డీలా పడిపోయి ఉన్నాడట. ఆ హీరోతో తనను అచ్చొచ్చిన కామెడీ కంటెంట్ తో పక్కా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడట మారుతీ. ది రాజాసాబ్ విషయంలో తనను ఎంతలా ట్రోలింగ్ చేశారో అంతకంటే ఎక్కువ హిట్ కొట్టాలని చూస్తున్నాడట. ఈ మేరకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాడు.
ఈ సినిమాలో నటిస్తున్న హీరోకి సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఆ బ్యానర్ లోనే ఈ కొత్త సినిమాను తెరకెక్కించనున్నాడట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్. మరి ది రాజాసాబ్ లాంటి ప్లాప్ తరువాత మారుతీ చేస్తున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి విజయాన్ని ఇస్తుంది అనేది చూడాలి.
